భైంసాలో శాంతియుతంగా నిమజ్జనాలు

ఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు

Sep 15, 2024 - 15:08
Sep 15, 2024 - 15:11
 0
భైంసాలో శాంతియుతంగా నిమజ్జనాలు

నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా భైంసాలో వినాయక నిమజ్జనం శోభాయాత్ర ఆదివారం భారీ బందోబస్తు మధ్య ప్రారంభం అయింది. సమస్యాత్మక ప్రాంతం కావటంతో శోభాయాత్ర సందర్భంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. గడ్డెన్న వాగు ప్రాజెక్ట్ దగ్గర నిమజ్జనానికి తగిన  ఏర్పాట్లు చేయటంతో పాటు 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు మధ్య నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ జి.జానకి షర్మిల తెలిపారు. నిమజ్జనమార్గంలో ఉన్న 200 సీసీటీవీ లను పొలీస్ స్టేషన్ పరిధిలోని కంట్రోల్ రూంతో అనుసంధానం చేశారు. ఎస్పీ జానకీ షర్మిల ఉదయం నుంచి స్వయంగా అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

వినాయక నిమజ్జనంలో ఎమ్మెల్యే..

వినాయక నిమజ్జనంలో స్థానిక ఎమ్మెల్యే రామారావు పటేల్​ పాల్గొన్నారు. వినాయకుడికి పూజలు నిర్వహించి హారతి కార్యక్రమం అనంతరం వినాయక నిమజ్జనానికి హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు కాశీనాథ్​ తో కలిసి ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా పూర్తి చేశారు. శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు కృషి చేస్తున్న ఎస్పీ జానకీ షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్​ కుమార్​ లకు ఎమ్మెల్యే రామారావు పటేల్​ ధన్యవాదాలు తెలిపారు.