బాసరలో హుండీ పగుల కొట్టిన దొంగలు
ఆలయాన్ని పరిశీలించి ఎస్పీ జానకీ షర్మీల
నా తెలంగాణ, నిర్మల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో హుండీ పగుల కొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ డా. జానకీ షర్మిల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి దొంగతనం విషయంపై ఆరా తీశారు. ఘటన బాధాకరమన్నారు. పుణ్యక్షేత్ర విధుల్లో ఉన్న హోం గార్డులను ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని తెలిపారు. భక్తులు ఆందోళన చెందవద్దని జానకీ షర్మిల తెలిపారు. అసత్య ప్రచారాలు నమ్మవద్దని కోరారు. ఎస్పీ వెంట ఆలయ పరిశీలనలో ముధోల్ సిఐ, బాసర ఎస్ ఐ, సిబ్బంది ఉన్నారు.