పరాన్నజీవుల పార్టీ కాంగ్రెస్ కేంద్రమంత్రి జేపీ నడ్డా
JP Nadda, Union Minister of Parasite Party Congress
మభ్యపెట్టి అధికారంలోకి
హామీలపై ముఖం చాటేస్తుంది
అప్పులతో రాష్ట్రాన్ని నడపలేక తిప్పలు పడుతుంది
తెలంగాణ కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ఎండగట్టాలి
జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి
నా తెలంగాణ, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవుల పార్టీ అని, మభ్యపెట్టే పార్టీ అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా అన్నారు.
అన్నారు. ఈ పార్టీ తన బలం మీద నిలబడలేదన్నారు. ఇతర పార్టీలను నమ్ముకొని నిలబడుతుందని నిలదొక్కుకున్నాక ఆ పార్టీలను ముంచేస్తుందన్నారు. తెలంగాణ రైతులు, యువత, మహిళలు, దళితులు, నిరుపేద వర్గాలకు ఇచ్చిన హామీలు అమలులో హస్తం పార్టీ చతికిలపడిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపేందుకు అప్పులు చేస్తూ తిప్పలు పడుతోందని జేపీ నడ్డా విమర్శించారు. అసత్యాలను, అబద్ధాలను ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రస్తుతం హామీలను అమలు చేయలేక ప్రజలతో ముఖం చాటుకొని తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ యేడాది పాలన ఎండగట్టేందుకు రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, బీజేపీ నాయకులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని జేపీ నడ్డా కోరారు. ప్రజలకు ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ఎండగట్టాలని నడ్డా తెలిపారు.
కిషన్ రెడ్డి ప్రయత్నంపై జేపీ నడ్డా హర్షం..
శనివారం కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాల పై హైదరాబాద్ లోని సరూర్ నగర్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సభకు కేంద్రమంత్రి జేపీ. నడ్డా ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ పాలనను ఎండగట్టారు. ఎండగట్టారు. కిషన్ రెడ్డి చేస్తున్న ఈ ప్రయత్నంపై హర్షం వ్యక్తం చేశారు.
హామీలతో నిలువెల్లా ముంచారు..
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నిలువెల్లా ముంచిందని, మోసం చేసిందని ఆరోపించారు. తెలంగాణలో రూ. 12వేలు ప్రతీ ఆటోడ్రైవర్ లకు, రైతులకు రూ. 15వేలు, కౌలు రైతులకు రూ. 12వేలు, విద్యాభరోసా కార్డు, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి, మహిళలకు ప్రతీ నెలా రూ. 2500, షాదీ ముబారక్, ఒక తులం బంగారం, యాదవ, కురుమ సంఘాలకు రూ. 2 లక్షల హామీలు ఏమయ్యాయని నడ్డా నిలదీశారు.
తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం..
ప్రధాని మోదీ ప్రభుత్వం తెలంగాణకు 1.60 లక్షల కోట్లు, గ్రాంట్ ద్వారా రూ.1.12 లక్షల గ్రాంట్లు, వరంగల్ కు రూ. 27 కోట్లు, టెక్స్ టైల్ పార్కు, రైల్వేకు 20 రెట్లు బడ్జెట్, మూడు వందేభారత్, భారత్ మాలా ప్రాజెక్టు కింద ఐదు జాతీయ రహదారులు, బీబీనగర్ ఎయిమ్స్ నిర్మాణం లాంటి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు ఇచ్చారన్నారు. బీజేపీ ఇవ్వని హామీలను కూడా అమలు చేసే పార్టీ అని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కూడా ముఖం తప్పించుకు తిరిగే పార్టీ అని, హామీలు అమలు చేయలేక చేతులెత్తేసే పార్టీ అని నడ్డా విమర్శించారు. బీజేపీ ప్రజాసమస్యల పరిష్కారానికి, దేశాభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునే వరకు ఒక రకంగా, అధికారంలోకి వచ్చాక మరో రకంగా వ్యవహరిస్తూ హామీలపై కప్పదాటు ధోరణిని అవలంబిస్తుందని నడ్డా ఎద్దేవా చేశారు.
హస్తం పార్టీతో దేశ ప్రజలు విసుగు చెందారు..
70యేళ్లుగా వీరి మాటలను వినివిని దేశ ప్రజలు విసుగు చెందారని అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి 19 రాష్ర్టాల్లో అధికారం కల్పించారన్నారు. తెలంగాణ భవిష్యత్ కోసం కమలం పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్, యూపీ, మహారాష్ర్ట, ఉత్తరాఖండ్, మణిపూర్, అసోం, హరియాణాలలో వరుసగా అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీ అన్నారు. గెలుపు రికార్డులను బద్ధలు కొట్టామన్నారు. జమ్మూకశ్మీర్ లోనూ అత్యధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుందన్నారు. చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ లో 64 సీట్లపై బీజేపీ–కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీ జరగ్గా ఇందులో 62 స్థానాలను బీజేపీ గెలిచిందన్నారు. కాంగ్రెస్ చతికిల పడిందన్నారు.
కూటమిగా జతకట్టి అధికారంలోకి.. రాష్ర్ట పార్టీలను పక్కకు నెట్టేసే యత్నం..
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ర్ట పార్టీలతో కూటమిగా జతకట్టి గెలుస్తూ అధికారం చేజిక్కించుకున్నాక ఆ పార్టీలను నట్టేట ముంచుతుందన్నారు. హిమాచల్, కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో ఇదే మాదిరిగా గెలిచి సాధ్యం కాని హామీలను అమలు చేయలేక రాష్ట్రాలను అప్పుల కొలిమిలోకి నెడుతుందని జేపీ నడ్డా విమర్శించారు. అప్పులు చేసి అధికారాన్ని కాపాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ విధానమని ఎద్దేవా చేశారు. ఇలా చేసే ఏ పార్టీలు ఎక్కువ కాలం మనుగడ సాగించలేవన్నారు.