సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

Distribution of CMRF cheques

Oct 29, 2024 - 21:21
 0
సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నా తెలంగాణ, సంగారెడ్డి టౌన్: కంది, కొండాపూర్ మండలాలకు చెందిన సిఎంఆర్​ ఎఫ్​ చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా లబ్ధిదారులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ.. ఖరీదైన వైద్యం చేసుకోలేకపోతున్న కుటుంబాలకు ఆసరాగా నిలుస్తుందన్నారు. ఎమ్మెల్యే ద్వారా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. 
ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, విఠల్, కార్యదర్శులు శ్రీనివాస్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, కృష్ణ గౌడ్, మోహన్ రెడ్డి, పాండు, నగేష్ , లబ్దిదారులు పాల్గొన్నారు.
 
ర్యాగింగ్​ కు దూరం: ఎస్సీ చెన్నూరి
ర్యాగింగ్ కు పాల్పడి చట్టం ముందు దోషులుగా నిలువొద్దని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్  విద్యార్థులకు సూచించారు. ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన యాంటీ ర్యాగింగ్, యాంటీ డ్రగ్ సెన్సిటైజేషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు, హెచ్చరికలు జారీ చేశారు. 
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా.సుధామాధురి, సూపరింటెండెంట్ డా.అనిల్ కుమార్, మెడికల్ కళాశాల ప్రొఫెసర్స్, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
 
త్రీ కె  రన్..
అక్టోబర్ 29 న ప్రపంచ బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) దినోత్సవాన్ని పురస్కించుకుని హోప్ న్యూరో, కార్డియాక్ ఆసుపత్రి ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 7గంటలకు 3కె రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా అడిషనల్ ఎస్పీ, సంజీవ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యం, రోగాల వ్యాప్తి, నివారణ, చికిత్స తదితరాలపై మాట్లాడి కార్యక్రమానికి విచ్చేసిన వారికి అవగాహన కల్పించారు. 
 
ఈ కార్యక్రమంలో ఐఎంఎం అధ్యక్షులు డా. ఉషా కిరణ్, యువజన సంఘాల అధ్యక్షులు కూన వేణు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు అతిమెల మానిక్ తదితరులు పాల్గొన్నారు.
 
సర్వేకు ఏర్పాట్లు: కలెక్టర్​ క్రాంతి వల్లూరు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే నవంబర్ లో నిర్వహిస్తామని కలెక్టర్​ క్రాంతి వల్లూరు స్పష్టం చేశారు. ఇందుకోసం అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. సర్వేకోసం ఎమ్యూరేటర్లు, ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు. గ్రామాలు, గ్రామ పంచాయితీలలో విలనం కావడంతో ఎదురవుతున్న సమస్యలపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్  చంద్రశేఖర్,  ట్రయినింగ్ కలెక్టర్ మనోజ్,  జడ్పీ సీఈఓ జానకి రెడ్డి,  సీపీవో బాలశౌరి, ఆర్డీవో రవీందర్ రెడ్డి,  ఎంపీడీవో లు తహసీల్దార్ లు  మునిసిపల్ కమీషనర్ లు తదితరులు పాల్గొన్నారు.