నా తెలంగాణ, ఆదిలాబాద్: తెలంగాణ రైతులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందని, కాంగ్రెస్ నాయకులను రైతులు గ్రామాల్లో తిరగనివ్వొద్దని బిజెపి యువమోర్చా బోథ్ అసెంబ్లీ ఐటి, సోషల్ మీడియా కన్వీనర్ గాజుల రాకేష్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రాంత రైతుల కష్టాన్ని కర్ణాటక రైతులకు కాంగ్రెస్ పార్టీ దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో క్వింటాలు పత్తి రేటు రూ. 7521 ఉంటే, కాంగ్రెస్ పాలిత కర్ణాటక రాష్ట్రంలో రూ. 8972 ఉందని దీని ఆంతర్యం ఏంటని అన్నారు.
కర్ణాటకలో, తెలంగాణలో పాలించేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయినా కొనుగోళ్లలో వ్యత్యాసం ఎందుకు ఉందని, దాని వెనక ఉన్న ఉద్దేశ్యం ఏంటని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా పత్తికి ఒకే రేటు ఉన్నప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరను పెంచి రైతులకు లాభం చేకురిస్తే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ఉందని, తెలంగాణలో కొనుగోలు చేసిన పత్తిని కర్ణాటకలో అధిక రేటుకు అమ్ముకుని కాంగ్రెస్ నాయకులు సొమ్ము చేస్కుంటున్నారేమోనన్న అనుమానం కలుగుతుందని అన్నారు.
మద్దతు ధర ను పెంచి రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతాంగానికి చిత్త శుద్ధి ఉంటే కర్ణాటక లో మాదిరిగా క్వింటాలుకు రూ. 8972 కొనుగోలు చేసి పత్తి రైతులకు అండగా ఉండాలని లేదంటే కాంగ్రెస్ నాయకులను గ్రామాల్లో తిరగనివ్వమని హెచ్చరించారు.
కొందరు చోటా మోటా కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా బిజెపి పై విమర్శలు చేస్తున్నారని వారికి చిత్త శుద్ధి ఉంటే ముఖ్యమంత్రి తో మాట్లాడి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. కల్పిత కథనాలతో, అవగాహన రాహిత్యంతో బిజెపిని విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.