పీఎం శ్రీ నిధులతో ప్రయోగశాలలకు ఎమ్మెల్యే ఏలేటి భూమిపూజ
MLA Aleti Bhumipooja for laboratories with funds from PM Shri
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో పీఎం శ్రీ నిధులతో నిర్మించనున్న ప్రయోగశాలలకు శాసన సభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బుధవారం భూమిపూజ చేశారు. సోన్ మండలంలోని లెఫ్ట్ పోచంపాడు తెలంగాణ సాంఘిక సంక్షేమ పాఠశాల, కళాశాలలో రూ.13.50 లక్షలతో నిర్మించనున్న సైన్స్ ల్యాబ్ నూతన భవన నిర్మాణానికి , డ్యాంగాపూర్ ప్రభుత్వ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రూ.13.50 లక్షలతో సైన్స్ ల్యాబ్ నూతన భవన నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ బర్ల మానస హరీష్ రెడ్డి, మాజీ ఎంపీపీ సరికెల గంగన్న, ఎంపీటీసీ , నాయకులు మార గంగారెడ్డి తదితరులు ఉన్నారు.