ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు
Happy Friends Day
నా తెలంగాణ, గజ్వేల్: స్నేహితుల దినోత్సవం సందర్భంగా రాయరావు విశ్వేశ్వర్ రావు రచించిన, సత్యదీప్ శర్మ సంగీతం అందించిన పాట ఆడియోను గజ్వేల్ లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ పాటను వర్థమాన గాయని కొక్కరకుంట శర్వాణి పాడారు. సూర్య నమస్కారం, గజ్వెల్, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, స్నేహితుల సమక్షంలో ఆడియో ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా పి. నర్సింలు, ఆర్ సీ గోలి సంతోష్ గుప్తా, గీత రచయిత విశ్వేశ్వర రావులు మాట్లాడారు. స్నేహం మనిషికి ఒక వరమన్నారు. వ్యక్తిగత సమగ్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తుందన్నారు. స్నేహం ఒక వదలలేని వ్యసనమని పేర్కొన్నారు. ప్రతీయేటా స్నేహితుల దినోత్సవం రోజున ఒక పాటను రచిస్తూ తమ స్నేహం విశిష్ఠతను చాటుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో సుభాష్ రెడ్డి, బాలచంద్రం, రాజు, నిమ్మ రమేశ్, సుదర్శన చారి, లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ గజ్వెల్ ప్రెసిడెంట్ మల్లేశం గౌడ్, గోలి సంతోష్ గుప్త, పరమేశ్వరా చారి, గుడాల రాధాకృష్ణ, సత్యనారాయణ స్నేహితులు పాల్గొని స్నేహితుల రోజు శుభాకాంక్షలు తెలుపుకొని ఆనందం వ్యక్తం చేశారు.