పశువులకు వ్యాక్సినేషన్ చేపట్టాలి
గ్రంథాలయాలలో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
నా తెలంగాణ, మెదక్: పాడిపశువులకు ఎలాంటి వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు, వ్యాక్సినేషన్ లు చేయాలని పశువైద్య అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. మండలంలోని మాచవరం గ్రామంలో ఉన్న పశు వైద్యశాలను, గ్రంథాలయాన్ని శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పలు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్యులు సమయపాలన పాటించాలని ఆదేశించారు. పశువులకు వ్యాధులు రాకుండా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
అనంతరం గ్రంథాలయం లోని పరిసరాలను, మరుగు దొడ్ల పరిశీలించారు. గ్రంథాలయంలో ఇంటర్నెట్ ఏర్పాటు చేయాలన్నారు. నూతన పుస్తకాలు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. గ్రంథాలయాన్ని ఉపయోగించుకొని విద్యార్థులు ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారని గుర్తుంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్, జిల్లా గ్రంథాలయ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.