అభివృద్ధి ప్రదాత మోక్షగుండం

మున్సిపల్ ఛైర్మన్ ఈశ్వర్

Sep 15, 2024 - 15:24
 0
అభివృద్ధి ప్రదాత మోక్షగుండం
నా తెలంగాణ, నిర్మల్: దేశం, రాష్ర్టం ఎన్నో అద్భుతాలు, ఆవిష్కరణల వెనుక ఘనత వహించిన ఇంజనీర్ల పాత్రనే పై చేయిగా నిలుస్తుందని మునిసిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ అన్నారు. భారత దేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య  ఇంజినీరింగ్ విభాగంలో అపారమైన సేవలందించారని, వారి జయంతిని ఇంజనీర్స్ డే గా జరుపుకోవడం అభినందనీయమని కొనియాడారు. మోక్షగుండం జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని చైన్ గేట్ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి విగ్రహాన్ని ఆదివారం మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్ పలువురు ఇంజనీర్లతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటి, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో భారతదేశాన్ని సస్యశ్యామలం చేశారన్నారు. దేశాభివృద్ధి, మానవ కళ్యాణమే పరమావధిగా తన ఇంజనీరింగ్ ప్రతిభతో ఆధునిక భారత నిర్మాణానికి పునాది వేసిన మహానుభావుడు
ప్రముఖ ఇంజనీర్ దిగ్గజం, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య అని ఆయన చేసిన సేవలను కొనియాడారు. 
 
ఈ కార్యక్రమంలో ఈఈలు శంకరయ్య, అశోక్ కుమార్, రామారావు, శైలేందర్, డీఈలు జాదవ్ సంతోష్, తుకారాం, రాజేందర్, భీంసింగ్ తదితరులు ఉన్నారు.