నగదుతో అమ్మవారి మండపం

రూ.21 లక్షలతో అలంకరించిన నిర్వహకులు

Oct 9, 2024 - 19:23
 0
నగదుతో అమ్మవారి మండపం
నా తెలంగాణ, నిర్మల్: నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ లోని ఏకనాథ్ ఆలయం సమీపంలో అమ్మవారి మండపాన్ని రూ.21 లక్షలతో అలంకరించారు. మాస్టర్ డి యూత్ సభ్యులు దుర్గామాత గత 20 ఏళ్లుగా ప్రతిష్టిస్తూ వస్తున్నారు. ఈ ఏడు 21 వ సంవత్సరం సందర్బంగా రూ. 21 లక్షలతో బుధవారం అలంకరించారు.ఈ కార్యక్రమంలో అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.