పీఆర్టీయూ (టీఎస్)లో ఎస్టీఎఫ్ రాష్ట్ర బాధ్యులు చేరిక
Inclusion of state officials of STF in PRTU (TS)
నా తెలంగాణ, మొయినాబాద్: ఎస్టీఎఫ్ రాష్ట్ర బాధ్యులు అరుణ్ కుమార్ గౌడ్ ఎల్ఎఫ్ ఎల్ ప్రధానోపాధ్యాయుడు (అజీజ్ నగర్), ఎస్టీఎఫ్ మహిళా కార్యదర్శి శ్రీదేవిలు మొయినాబాద్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బందయ్య, నరేందర్ రెడ్డి సమక్షంలో పీఆర్టీయూలో చేరారు. గురువారం జరిగిన ఈ సమావేశంలో రంగారెడ్డి జిలలా పీఆర్టీయూ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి హాజరై అరుణ్ కుమార్ గౌడ్ ను అభినందించారు.
అనంతరం అరుణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. పీఆర్టీయూలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సంఘంలో ఒక కుటుంబ సభ్యునిగా తనను అక్కున చేర్చుకున్నందుకు ప్రతీ ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. పీఆర్టీయూ నిర్ణయాలు, నిబంధనలకు కట్టుబడి నడుచుకుంటానని, పనిచేస్తానని స్పష్టం చేశారు. సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని అరుణ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామన్నారు. ఉద్యోగుల హెల్త్ స్కీమ్ కు పక్కా ప్రణాళిక రూపొందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. పీఆర్టీయూ మేనిఫెస్టోలో నిర్ణయించిన విధంగా సీపీఎస్ రద్దుకు, ఓపీఎస్ అమలుకు ప్రయత్నిస్తామన్నారు. మండలశాఖ పనితీరు ప్రశంసనీయమన్నారు. అజీజ్ నగర్ ప్రధానోపాధ్యాయులు శేఖర్ రెడ్డి, అందాపూర్ ప్రధానోపాధ్యాయురాలు రేణుకలకు రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బందయ్య, ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, గౌరవ అధ్యక్షులు అబ్దుల్ హమీద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామల మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కోనాగారి కృష్ణారెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు చిన్న మంగళారం ప్రధానోపాధ్యాయులు వెంకటయ్య, అందాపూర్ ప్రధానోపాధ్యాయురాలు రేణుక, అజీజ్ నగర్ ప్రధానోపాధ్యాయుడు శేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు సత్యనారాయణ రెడ్డి, నరేందర్, సంజీవన్ కుమార్, యాదగిరి, వేణుగోపాల్ మంజుల, రాష్ట్ర ఉపాధ్యక్షులు బీమ్లా నాయక్, జంగయ్య, నరసింహారెడ్డి. జిల్లా బాధ్యులు వినోద్ కుమార్, మహమూద్, జహీర్ హుస్సేన్, రవి, వెంకటేశ్వర్ రెడ్డి, వేణు, మండల అసోసియేట్ అధ్యక్షులు రాములు, కార్యవర్గ సభ్యులు రాజ్యలక్ష్మి, సులోచన, సైరా, మాలతి, సరిత, నిషాత్ ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.