కిటికీలోంచి రాఖీ వెల్లివిరిసిన అనురాగం ఆప్యాయత
సోషల్ మీడియాలో హర్షం
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కిటికిలోంచే రాఖీ కట్టి అక్కా, చెల్లెళ్లు తమ సోదరునిపై ప్రేమను చాటుకున్నారు. అదే సమయంలో హాస్టల్ లో ఉన్న తమ అక్కళ్లతో రాఖీ కట్టించుకోని ఆ చిన్నారి మురిసిపోయాడు. రాఖీ పండుగ సోమవారం ప్రభుత్వం సెలవు ప్రకటించలేదు. మంచిర్యాల జిల్లా బీమారానికి చెందిన దాసరి అశ్విక, సహస్రలు రామకృష్ణాపూర్ గురుకుల బాలిక సంక్షేమ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు. వీరికి ఒక చిన్నారి తమ్ముడు ఉన్నాడు పేరు జితేంద్ర. రాఖీ పండుగ కావడంతో హాస్టల్ లో తమ తమ్ముడికి రాఖీ కట్టేందుకు వచ్చారు. విజిటింగ్స్ అవర్స్ కూడా లేకపోవడంతో తప్పక తండ్రి తన కుమారుడు జితేంద్రను భుజాలపై ఎత్తుకోగా అశ్విక, సహస్ర్తలు కిటిలోంచే రాఖీ సోదరునిపై తమ ప్రేమ అభిమానాలను సోదరునిపై చాటుకున్నారు.
కాగా ఈ ఘటనను వీడియో తీసిన పలువురు రాఖీ పండుగ, సోదర సోదరీమణుల అనురాగాలు, ఆప్యాయతలపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఏది ఏమైనా రాఖీ పండుగ రోజున ఎన్ని అవాంతరాలు ఎదురైనా సోదరునికి రాఖీ కట్టిన అక్కా, చెల్లెళ్ల ప్రయత్నం, ఆ తండ్రి తపనను వేనోళ్ల కొనియాడుతున్నారు.