ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య

కుటుంబ కలహాలే కారణమా?

Jun 21, 2024 - 13:41
 0
ఎమ్మెల్యే సతీమణి ఆత్మహత్య

నా తెలంగాణ, కరీంనగర్​: కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో గురువారం రాత్రి ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు. గత 12 సంవత్సరాల క్రితం రూపదేవిని సత్యం వివాహం చేసుకున్నారు. రూపాదేవి మేడ్చల్ మునిరాబాద్ లోని  ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఎమ్మెల్యే దంపతుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు కుమారుడు యోజిత్​(11), కుమార్తె రిషిక శ్రీ (9) ఉన్నారు. భార్య మృతిని తట్టుకోలేక ఎమ్మెల్యే ఆసుపత్రిలో పలుమార్లు స్పృహ తప్పిపడిపోయారు. విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్​ ఎమ్మెల్యే సత్యంను పరామర్శించారు. కాగా పోలీసులు ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు.