మానుకోట పోలీసుల మానవీయ కోణం

నిరుపేదలకు ఆపన్నహస్తం ఎస్పీ నేతృత్వంలో ఆర్థిక సహాయ సహకారాలు పోలీసుల సేవలను వేనోళ్ల పొగుడుతున్న ప్రజలు

Jul 28, 2024 - 15:33
 0
మానుకోట పోలీసుల మానవీయ కోణం

నా తెలంగాణ, డోర్నకల్: పోలీస్​ అంటే నిందితులు, నేరస్థుల గుండెల్లో గుబులు పుట్టించే వారే కాదని, వారి మనసుల్లోనూ దయ, జాలి, కరుణ వంటివి ఉంటాయని నిరూపించుకుంటున్నారు మానుకోట పోలీసులు. మహాబూబాబాద్​ జిల్లా ఎస్పీ సుధీర్​ రామ్​ నాథ్​ కేకన్​. జిల్లా పాలనలో ఒకవైపు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతూనే మరోవైపు బాధితులకు భరోసా కల్పిస్తూ సహాయ సహకారాలు అందజేయడంలో ముందుంటున్నారు. 

రోడ్డు ప్రమాదాల బారిన కుటుంబాలను ఆదుకుంటున్నారు. రోడ్ల మరమ్మతులపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. ఆయా కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, ఇతర సామాగ్రిని అందజేస్తూ ఎస్పీ తన దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. అదే సమయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్​ కు అధిక ప్రాధాన్యమిస్తూ జిల్లా వాసులతో భేష్​ అనిపించుకోవడం ఎస్పీకే చెల్లిందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నర్సింహుల పేట పెద్ద నాగారం గ్రామానికి చెందిన అంధత్వం గల వ్యక్తికి ఇంటిని నిర్మించడంలో తనవంతే గాకుండా సాటి పోలీసులతో కూడా ఆర్థిక సహకారం కూడగట్టుకొని నిర్మింప జేశారు. ఆదివారం గృహ ప్రవేశం సందర్భంగా ఎస్పీకి, పోలీసులకు ఆహ్వానం పంపడంతో నిరుపేద ఇంటికి చేరుకొని వారికి ఎల్లవేళలా పోలీసు సహాయ సహకారాలు ఉంటాయని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ, సాటి పోలీసుల మానవీయ కోణాన్ని ప్రజలు వేనోళ్ల పొగిడారు.