మాది చేతల ప్రభుత్వం
కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి
నా తెలంగాణ, హైదరాబాద్: బీఆర్ఎస్ లాగా మాది మాటల ప్రభుత్వం కాదని ..మాది చేతల ప్రభుత్వం అని కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. దీనిపై తెలంగాణ ప్రజాపాలన ఘనత వల్ల ఏడాదిలో నిరుద్యోగ శాతం భారీగా తగ్గిందన్నారు. కేంద్ర కార్మిక బలగం త్రైమాసిక నివేదికలో వెల్లడించిందని చెప్పారు. గత ఏడాది 2023 జులై- సెప్టెంబర్ రాష్ట్ర నిరుద్యోగ శాతం 22.9 శాతం ఉండగా.. 2024 జులై- సెప్టెంబర్ లో తెలంగాణలో నిరుద్యోగ శాతం 18.1 శాతంగా నమోదు అయ్యిందని తెలిపారు. ఆరు నెలల్లో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో భారీగా పెరిగిన ఉద్యోగ అవకాశాలే దీనికి కారణమని నివేదికలో వెల్లడైనట్లు సామా వివరించారు.