డ్రగ్ ఫ్రీగా మెదక్  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

Drug Free Medak District Collector Rahul Raj

Oct 29, 2024 - 21:03
 0
డ్రగ్ ఫ్రీగా మెదక్  జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 
 నా తెలంగాణ, మెదక్: ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని మెదక్ ను డ్రగ్ ఫ్రీ మెదక్ గా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకాంక్షించారు. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్ అబ్యూస్ ఇన్ యూత్ అనే శిక్షణ కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ శిక్షణ కార్యక్రమం పూర్తి చేసుకున్నారు. 
 
మంగళవారం  యాంటీ డ్రగ్ సోల్జర్ పోస్టర్​ ను కలెక్టర్  రాహుల్ రాజ్ విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. డ్రగ్స్ వినియోగం  మహమ్మారిగా మారిందని, దీని ద్వారా యువత వారి జీవితాలను, కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్​ మహమ్మారిని పోలీసులు, అధికారులు, ప్రతీ ఒక్క పౌరులు బాధ్యతగా తీసుకోని నివారించే చర్యలను చేపడతామన్నారు. డ్రగ్స్​ సరఫరా చేసే వారు ఎవరైనా కనిపిస్తే వెంటనే 1908కి తెలపాలని కోరారు. 
ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాధా కిషన్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి సతీష్ కుమార్, రాకేష్ కుమార్ పాల్గొన్నారు.
 
అదనపు కలెక్టర్​ మంచు నగేష్​ బాధ్యతల స్వీకరణ..
మెదక్  జిల్లా అదనపు కలెక్టర్ గా మంచు నగేష్ మంగళవారం బాధ్యతలను స్వీకరించారు. కలెక్టర్ రాహుల్ రాజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా అదనపు  కలెక్టర్ మంచు నగేష్ మాట్లాడుతూ జిల్లా సమర్థవంతమైన పాలనలో కలెక్టర్ సూచనలు సలహాలు పాటిస్తూ వివిధ శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరవేసేందుకు విశేష కృషి చేస్తానని తెలిపారు.
 
నవంబర్ 6 నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే విజయవంతంగా నిర్వహించాలని  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు అన్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు మధిర తహసిల్దార్ కార్యాలయం నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై రాష్ట్ర ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి, ఇతర ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై సమీక్షించారు.
ఈ కార్యక్రమంలో మెదక్​ జిల్లా నుంచి అదనపు కలెక్టర్ ఎం నగేష్, ఆర్డీవోలు, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, మెదక్ రమాదేవి, తూప్రాన్ జయచంద్ర రెడ్డి, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డీపీవో యాదయ్య, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీరామ్ వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.