అడ్డొచ్చిన చిరుత.. కారు బోల్తా

భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు

Jun 26, 2024 - 15:26
 0
అడ్డొచ్చిన చిరుత.. కారు బోల్తా

నా తెలంగాణ, నిజామాబాద్: నడిరోడ్డుపై అడ్డువచ్చిన చిరుతను తప్పించే ప్రయత్నంలో దంపతుల్లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం రాత్రి గాంధారి మండలం యాచారం గ్రామానికి చెందిన మాలోత్​ ప్రభాకర్​, లలిత అనే దంపతులు మంగళవారం తమ బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తున్నారు. కామారెడ్డి జిల్లా మోపాల్​ మండలం ఎల్ల్మకుంట శివారు వద్దరు రాగానే చిరుత రోడ్డుపైకి వచ్చింది. దాన్ని తప్పించేందుకు ప్రయత్నించగా కారు బోల్తా కొట్టింది. దీంతో సంఘటనా స్థలంలోనే భార్య లలిత మృతి చెందగా, ప్రభాకర్​ కు తీవ్ర గాయాలయ్యాయి. వాహనదారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ప్రభాకర్​ ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.