గాంధారి మైసమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం
Devotees flock to Gandhari Maisamma fair
నా తెలంగాణ,రామకృష్ణాపూర్: బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధి గాంధారి మైసమ్మ జాతరకు ఆదివారం భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. జాతరకు కోల్ బెల్ట్ రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, నస్పూర్, శ్రీరాంపూర్ ఇతర జిల్లాల, రాష్ట్రల నుంచి తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నా రు. భక్తులు వాహనాలకు అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ జాతరకు నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మైసమ్మ జాతర బోనల ర్యాలీలో పాల్గొని బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించారు. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ గాంధారి మైసమ్మను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. జాతర జాతీయ రహదారి పక్కన జరుగుతున్నందున పోలీసులు భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాతీయ రహదారిపై బారీకేడ్ల ఏర్పాటు, రోడ్డు మార్గాల వద్ద పోలీస్ పెట్రోలింగ్ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏసీపీ రవి కుమార్ తెలిపారు. గాంధారి మైసమ్మ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.