హస్తం దుష్ట పన్నాగాలు ఫలించలే
డబుల్ ఇంజన్ కే ప్రజల మద్ధతు
రాహుల్ చిలుకపలుకలు (పోపట్) నమ్మలే
అంబేద్కర్ ను గౌరవించే వ్యక్తులే బీజేపీకి ఓటేశారు
ఏయిర్ పోర్ట్ లో నాలుగు విమానాలు, భోజనాలు
బీజేపీ కూటమి గెలుపుతో యూటర్న్
బాలాసాహేబ్ ఆశయాలకు భిన్నంగా వెళితే ప్రజలే బుద్ధి చెప్పారు
పనికిమాలిన రాజకీయ నాయకుడు సంజయ్ రౌత్
మీరు గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంలు ట్యాంపరింగ్ కాలేదా?
నా తెలంగాణ, హైదరాబాద్: మహారాష్ట్రలో ఎన్డీయే పూర్తి స్థాయిలో విజయం సాధించడంపై తెలంగాణ రాష్ట్రబీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మనదేశానికి ఆర్థిక రాజధాని అంచీ ముంబైలో కాంగ్రెస్ దుష్టపన్నాగాలు ఫలించలేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ డబుల్ సీట్లతో విజయం సాధించడం సంతోషకరమన్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్ పోతుందని మరాఠీలకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓట్లను దండుకొని లబ్ధి పొందారని అన్నారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు పూర్తిగా తెలుసుకున్నారని అన్నారు. ఇంత పెద్ద విజయమనేది మహారాష్ట్రలో ఇదే తొలిసారన్నారు.
విచ్ఛిన్నానికి ప్రజల విరుగుడు..
కాంగ్రెస్ పార్టీ కులం, మతం, భాష పేరుతో గురువింద సామెతలాగా ప్రజలను మభ్యపెడుతూ విచ్ఛిన్నం చేసేలా ప్రయత్నించిందన్నారు. ప్రజలకు అన్ని రకాల నష్టం కలిగించిన పార్టీయే కాంగ్రెస్ పార్టీ అన్నారు. అలాంటి పార్టీ బీజేపీపై ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు. తాత, నాన్నమ్మ ప్రధానులుగా పనిచేసి కాంగ్రెస్ 90 శాతం అధికారం వెలగబెట్టిందనే విషయాన్ని రాహుల్ చిలుకపలుకలకు ప్రజలు ఏ మాత్రం స్పందించలేదన్నారు. ప్రజలకు కాంగ్రెస్ దుష్ర్పచారం పూర్తిగా అర్థమైందన్నారు. ఝార్ఖండ్, మహారాష్ట్రల్లో చూసుకుంటే 30 సీట్లు కూడా వచ్చే పరిస్థితి రాహుల్ పార్టీకి లేదన్నారు. కనీసం విపక్ష హదా కూడా రాలేదన్నారు.
డబుల్ కు మరింత ఊపు..
డబుల్ ఇంజన్ సర్కార్ కు ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజల మధ్య కులం, మతం, భాష, ప్రాంతం పేరుతో విద్వేశాలు సృష్టించే ప్రయత్నాన్ని మహారాష్ర్ట ప్రజలు అడ్డుకున్నారని సంతోషం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఇక్కడ విషప్రచారం చేశారన్నారు. బాబా సాహేబ్ అంబేద్కర్ ను గౌరవించే వ్యక్తులు, వర్గాలు అనేకం ఇక్కడ ఉన్నాయన్న విషయాన్ని వారు మరిచారన్నారు. అటువంటి ప్రాంతంలో రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసిన ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలున్న ప్రాంతాల్లో కూడా ఎన్డీయే భాగస్వామ్య పార్టీలు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్నాయన్నారు.
అన్ని రాష్ర్టాల్లో బీజేపీ పాగా..
మహారాష్ర్టలో మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. తొలిసారి ఫడ్నవీస్ ఐదేళ్ల పరిపాలన, రెండోసారి ఫడ్నవీస్ నేతృత్వంలో ప్రజల ఆకాంక్షల మేరకు శివసేన, ఎన్సీపీని తీసుకొని పోటీచేసి గెలిచి రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకున్నామన్నారు. అనంతరం జరిగిన పరిణామాల్లో బీజేపీని అధికారం నుంచి దూరం చేసే ప్రయత్నాన్ని ఉద్ధవ్ ఠాక్రే చేశారన్నారు. దీన్ని ప్రజలు గమనించారన్నారు. అక్కడి ఎమ్మెల్యేలు బాలాసాహేబ్ ఆకాంక్షలతో ముందుకు వచ్చి షిండే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ముచ్చటగా మూడోసారి మహారాష్ర్టలో అధికారంలోకి వచ్చామన్నారు. గోవాలోనూ మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. హరియాణాలో రెండోసారి అధికారంలోకి వచ్చామన్నారు. మధ్యప్రదేశ్ లో అనేకసార్లు అధికారంలోకి వస్తున్నామన్నారు. ఇక యూపీని చూసుకుంటే రెండోసారి అధికారంలోకి, ఉత్తరాఖండ్ లో రెండోసారి, అసోంలో రెండోసారి అధికారంలోకి వచ్చామన్నారు.
పైలెట్లు వేయిటింగ్.. యూటర్న్ తో నవ్వుల పాలు..
బీజేపీ మోదీ నేతృత్వంలో చేసిన పనిని ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం గ్యారంటీల పేరుతో మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీ మూడు రాష్ర్టాలకే పరిమితమైందని అన్నారు. యూపీలో తొమ్మిది స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే ఏడు సీట్లు బీజేపీ గెలిచిందన్నారు. మహారాష్ర్టలో గత ఎన్నికల్లో 44 స్థానాలను గెలిచిన పార్టీ కూటమిగా ఏర్పడి పోటీ చేసినా సగం సీట్లు కూడా గెలవలేకపోయిందన్నారు. ఎన్నికల ఫలితాలు రాకముందే ముంబాయి ఏయిర్ పోర్ట్ లో నాలుగు విమానాలు కూడా సిద్ధం చేశారని, పైలెట్లు వచ్చారని, ఎమ్మెల్యేలకు కావాల్సిన బోజనాలు కూడా సిద్ధం చేశారన్నారు. ఫలితాలు వెలువడగానే వారంతా యూటర్న్ తీసుకొని దేశ ప్రజల ముందు నవ్వుల పాలయ్యారన్నారు.
శివసేన లక్ష్యం ఏంటీ? ఏ పార్టీతో కలిశారు..
ఉద్ధవ్ ఠాక్రే శివసేన కాంగ్రెస్ తో కలిసి బాలాసాహెబ్ ఠాక్రే ఆశయాలకు భిన్నంగా వెళ్లినందుకు ప్రజలు మూకుమ్మడిగా ఎన్డీయేకు మద్ధతిచ్చారని స్పష్టమైన మార్పు అంటే ఏమిటో చూపించారని అన్నారు. ఉద్దవ్, ఆదిత్య మాటలను లెక్కచేయలేదన్నారు. బాలాసాహెబ్ స్ఫూర్తిగా ప్రజలు ఎన్డీయే కూటమికి విజయాన్ని అందించారన్నారు. ఉద్దవ్ కు వచ్చిన కొన్ని సీట్లు కూడా ఆయనకు వచ్చిన సీట్లు కావన్నారు. ప్రజలు చైతన్యవంతులన్న విషయం మరోసారి నిరూపించారని పేర్కొన్నారు. శివసేన పార్టీ పెట్టిన లక్ష్యం ఏమిటని? ఆయన కుమారుడు ఎవరితో కలిసి పనిచేస్తున్నారని ప్రశ్నించారు. అందుకే ప్రజల తిరస్కారం తప్పలేదన్నారు. మహారాష్ర్ట ప్రజలు వారసత్వం చూడలేదన్నారు. బాలాసాహెబ్ స్ఫూర్తి, సిద్ధాంతాన్ని చూశారని అన్నారు. ఈ ఎన్నికల్లో రాజకీయ అవకాశ వాదం, అహాంకారం, ఉద్దవ్ ఠాక్రే, కాంగ్రెస్, శరద్ పవార్ ను ప్రజల ఛీత్కరించారన్నారు.
18కూడా వచ్చేట్లు లేవు..
102 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ క్రమేణా తగ్గుతూ 18 సీట్ల కు తగ్గిందన్నారు. దేశంలో ఇటీవల జరిగిన హరియాణా, జమ్మూకశ్మీర్ లో ఎన్నడూ లేని విధంగా బీజేపీ ప్రజల మద్ధతు కూడగట్టుకుందన్నారు. హరియాణాలో బీజేపీ ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో ఝార్ఖండ్ లో అనుకున్న లక్ష్యాలు నెరవేర్చుకోలేకపోయినా ఓట్లు, సీట్లు సాధించగలిగామన్నారు.
రౌత్ కు సిగ్గులేదా?..
మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంతాల్లో 138 సీట్లు వస్తే కాంగ్రెస్ కూటమికి కేవలం 28 సీట్లేనని ఇంకా తగ్గుతున్నాయని అన్నారు. సంజయ్ రౌత్ పనికిరాని రాజకీయ నాయకుడన్నారు. కనీసం చెప్పేందుకు కూడా సిగ్గు లేదన్నారు. ఈవీఎంలపై కుట్ర చేశారని ఆరోపించారన్నారు. గతంలో, ప్రస్తుతం మెజార్టీ వస్తుంటే ఎందుకు మాట్లాడడం లేదన్నారు. రాహుల్ తో సహా పార్లమెంట్ ఎన్నికల్లో ఈసీమీద తప్పుడు ప్రచారం చేశారన్నారు. వారు గెలిస్తే కర్ణాటక, తెలంగాణ, హిమాచల్, ఝార్ఖండ్ లలో గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్లు, బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగినట్లు ఆరోపణలు ఏ మాత్రం సమంజసమని నిలదీశారన్నారు.
నాందేడ్ లో బీజేపీ, వయోనాడ్ లో ప్రియాంక..
దేశవ్యతిరేక కార్యకలాపాలు, విచ్ఛిన్నకర శక్తులతో పని, ఐక్యతను దెబ్బతీయడమే కాంగ్రెస్ పని అన్నారు. నాందేడ్ ఎంపీ స్థానంలో బీజేపీ గట్టి పోటీ కొనసాగిస్తుందని, వయోనాడ్ లో ప్రియాంక ముందంజలో ఉన్నారన్నారు. యూపీ అతిపెద్ద రాష్ర్టంలో, మహారాష్ట్ర ఆర్థిక రాజధానిలో మూడోసారి అధికారంలోకి రావడం పట్ల మోదీ నాయకత్వంలో పట్ల ప్రజల విశ్వాసానికి మద్ధతు తెలియజేస్తుందని మహారాష్ర్ట ప్రజలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలిపారు.