అవినీతి చేసే రోజు వస్తే  రాజకీయాలే వదిలేస్తా

బీజేపీ ఎంపీ అర్వింద్‌

May 10, 2024 - 16:28
 0
అవినీతి చేసే రోజు వస్తే  రాజకీయాలే వదిలేస్తా

నిజామాబాద్​: ప్రజలు గట్టిగా కోరుకుంటే నెల రోజుల్లో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్‌ జిల్లాలోని వేల్పూరులో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అనుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. ఈ ఎన్నికల్లో మోదీకి ప్రజలు ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ పతనావస్థకు చేరింది. దేశంలో ఉన్న రెండు రాష్ట్రాల్లోనూ పడిపోతుంది. ఆ పార్టీ తప్పుడు హామీలతో గద్దెనెక్కి ప్రజలను మోసగించింది. ఐదేళ్లలో ఎంపీగా నాపై ఒక్క అవినీతి ఆరోపణ లేదు. నాకంటే ముందు ఎంపీగా ఉన్న కవిత జైలులో ఉన్నారు. అవినీతి చేసే రోజు వస్తే రాజకీయాలే వదిలేస్తా తప్ప.. తప్పు చేయను. ఇచ్చిన మాట ప్రకారం నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొచ్చా. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే జక్రాన్‌పల్లి ఎయిర్‌పోర్ట్‌ ఏడాదిలోపు తెరుచుకోవచ్చు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకున్నందున మన పనులు కావట్లేదు’’ అని అర్వింద్‌ ఆరోపించారు.