అల్లు అర్జున్ టాలీవుడ్ లో టాప్ స్టార్ గా నిలవడంతో పాటు పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ నటిస్తున్నాడు. తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు, ప్రేక్షకులు పుష్ప 2 సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా అల్లు అర్జున్ పర్సనల్ లైఫ్ కి కావాల్సినంత సమయం కేటాయించడం మనం చూస్తూనే ఉంటాం. భార్య స్నేహా రెడ్డి మరియు పిల్లలు అయాన్ ఇంకా అర్హ లతో బన్నీ క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేయడం మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా అల్లు అర్జున్, స్నేహాల గురించి ఒక ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. సాధారణంగా సెలబ్రిటీల ఇంట్లో జరిగే విషయాలు, ఇంట్లోని సంగతులు నెటిజన్స్ కి ఆసక్తిని కలిగిస్తూ ఉంటాయి. అల్లు అర్జున్ మరియు స్నేహా రెడ్డిలు ఎలా ఉంటారు, వారి పిల్లలతో ఖాళీ సమయంలో ఎలా టైం స్పెండ్ చేస్తారు అనేది సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే స్నేహా ని అల్లు అర్జున్ ఇంట్లో ఏమని పిలుస్తాడు, స్నేహా రెడ్డికి అల్లు అర్జున్ పెట్టిన నిక్ నేమ్ ఏంటి అనేది చాలా మందికి తెలియదు. స్నేహా రెడ్డి ని బన్నీ ఇంట్లో క్యూటీ అని ముద్దుగా పిలుచుకుంటాడట. ఆమె అందంకు తగ్గట్లుగా బన్నీ ఈ నిక్ నేమ్ పెట్టినట్లుగా అనిపిస్తుంది. హీరోయిన్స్ రేంజ్ అందం స్నేహా రెడ్డిది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పలు ఫోటో షూట్స్ లో ఆమె అందం హీరోయిన్స్ ను మించి ఉండటం మనం చూశాం. అందుకే క్యూటీ అంటూ బన్నీ ఆమెకు పేరు పెట్టి ఉంటాడు. మరి బన్నీ ని స్నేహా బన్నీ అనే పిలుస్తుందా లేదంటే ప్రత్యేకమైన నిక్ నేమ్ ఏమైనా పెట్టిందా అనేది తెలియాల్సి ఉంది. స్నేహా రెడ్డి సొంతంగా వ్యాపారాలు చేస్తూ ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ప్రత్యక్ష్య సాక్ష్యం అన్నట్లుగా నిలుస్తుంది. సోషల్ మీడియాలో స్నేహా రెడ్డి ఫోటోలు మరియు వీడియోలు రెగ్యులర్ గా వైరల్ అవుతాయి. హీరోయిన్స్ కి ఉండేంత ఫాలోయింగ్ ఇన్ స్టా లో స్నేహా రెడ్డికి ఉంది. ఇక బన్నీ పుష్ప 2 సినిమా విషయానికి వస్తే.. సుకుమార్ ఈ సినిమాను ఓ రేంజ్ లో రూపొందిస్తున్నాడు. గత రెండేళ్లుగా ఊరిస్తున్న పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. పుష్ప 2 మొదటి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.