ఎంపీలను పరామర్శించిన కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
Union Minister G. Kishan Reddy visited the MPs
నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో రాహుల్ చేసిన దౌర్జన్యంలో గాయపడ్డ బీజేపీ ఎంపీలు సారంగి, రాజ్ పుత్ లను న్యూ ఢిల్లీలోని ఆర్ ఎంఎల్ (రామ్ మనోహర్ లోహియా) ఆసుపత్రిలో శుక్రవారం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్, ఎంపీ కె. లక్ష్మణ్ లు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులపై వాకబు చేశారు. ఈ సందర్భంగా ఎంపీలు తమపై దాడి చేసిన తీరును మంత్రి కిషన్ రెడ్డికి వివరించారు. ధైర్యంగా ఉండాలని ఇలాంటి దాడులను ఉపేక్షించేది లేదని కిషన్ రెడ్డి రాహుల్ పై కనిపించారు. త్వరగా ఎంపీలు కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపీల ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్‌లో దాడులు విపక్ష పార్టీల నిరాశ, నిస్పృహలను కలిగిస్తున్నాయని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు.
మీడియాతో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి: వైద్యులు, అధికారులతో మాట్లాడాను. ఈ రోజు కూడా అబ్జర్వేషన్‌లో ఉంటారని, ఆరోగ్యం మెరుగు పడ్డాక వారిని నార్మల్ వార్డులో షిఫ్ట్ వైద్యులు తెలిపారు. ఎంపీ సారంగి సైకిల్ పై తిరుగుతూ ప్రజాసేవకు అంకితమైన వ్యక్తి. ఆయనపై రాహుల్ గాంధీ గుండాగిరి చేయడం సిగ్గు చేటు. రాహుల్ గాంధీ సహచర ఎంపీలపై దాడులకు వెంటనే పార్లమెంట్ లో యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. డా. అంబేద్కర్ విషయంలో కాంగ్రెస్ సర్టిఫికెట్ బీజేపీకి అవసరం లేదు. అడుగడుగునా అంబేద్కర్ అభివృద్ధి, ఆశయాలను అడ్డుకుంది, అవమానించింది. బీజేపీ ప్రధాని మోదీ హయాంలో అంబేద్కర్‌కు సముచిత స్థానం, గౌరవం లభించింది. ఆయన పేరు కూడా తీసే అధికారం కాంగ్రెస్ కు లేదు. కేంద్రమంత్రి అమిత్ షా అంబేద్కర్ స్ఫూర్తితో నడిచేవారని కాంగ్రెస్ లేని పోని అభాండాలు సృష్టిస్తుంది, దేశ ప్రజల తప్పుదోవ పట్టించేలా అవాస్తవాలను ప్రచారం చేస్తుంది.