నా తెలంగాణ, మొయినాబాద్: ఒక డీఏకు ప్రభుత్వం ఒప్పుకుందని, మార్చిలోపు నూతన పే రివిజన్ సాధించేందుకు పీఆర్టీయూ (టీఎస్–ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ తెలంగాణ) కృషి చేస్తుందని ఆ సంఘం రాష్ర్ట ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్ రెడ్డి అన్నారు.
బందయ్యా, నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆమ్డాపూర్ లో ఆత్మీయ సమ్మేళనం..
మొయినాబాద్ పీఆర్టీయూ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బందయ్యా, నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ఆమ్డాపూర్ లో అధ్యక్ష, కార్యదర్శులకు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళన, సన్మాన మహోత్సవంలో దామోదర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు.
చేరికలకు కృషి చేసిన మండల శాఖకు కృతజ్ఞతలు..
దామోదర్ రెడ్డి సమక్షంలో తెలంగాణ పీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్, నారాయణ, యూటీఎఫ్ మహిళా కార్యదర్శి రేష్మ (ఉపాధ్యాయురాలు) పీఆర్టీయూ–టీఎస్ లో చేరారు. వీరికి దామోదర్ రెడ్డి సాధారణంగా ఆహ్వానించారు. విస్తరణ కోసం మొయినాబాద్ మండల శాఖ చేస్తున్న కృషిని కొనియాడారు.
సమస్యల పరిష్కారానికి పదేళ్లుగా పోరాటం..
అనంతరం దామోదర్ రెడ్డి మాట్లాడుతు.. పదేళ్లుగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న సంఘం పీఆర్టీయూ అన్నారు. గత పదేళ్లుగా ఉపాధ్యాయులకు స్థానచలనం, ప్రమోషన్లు ఆశించిన మేర దక్కలేదన్నారు. ఈ విషయంపై తాము ప్రస్తుత ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించి సమస్యలను పరిష్కరించేలా కృషి చేశామన్నారు. 30వేలమందికి పీఆర్టీయూ–టీఎస్ ద్వారా పదోన్నతులు కాల్పించగలిగామని దామోదర్ రెడ్డి చెప్పారు. ఐదు డీఏఎలు పెండింగ్ లో ఉండగా అన్ని డీఏలు సాధించేందుకే తమ సంఘం కట్టుబడి కృషి చేసిందని ప్రస్తుత ప్రభుత్వం ఒక డీఏను వెంటనే దీపావళికి, మిగతా డీఏల సమస్యను మార్చిలోపు పరిష్కరించేందుకు ఒప్పుకుందని దామోదర్ రెడ్డి పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ స్థానాలను గెలిపించుకుందాం..
పీఆర్టీయూ–టీఎస్ పనితీరును గుర్తించి ఉపాధ్యాయులు తమ సంఘంలో చేరడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్, వరంగల్ రెండు స్థానాలలోనూ తమ సంఘం సభ్యుల కృషితో తమకు అనుకూలంగా ఉన్న ఎమ్మెల్సీలను గెలిపించుకొని తీరుదామని విజ్ఞప్తి చేశారు.
సన్మానాలు..
ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ–టీఎస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్నారెడ్డి, అధ్యక్షులు రాఘవేంద్ర, మండలం నుంచి రాష్ట్ర శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యాయులకు, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, శేర్ లింగంపల్లి మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి హనుమంతు, రవీందర్ రెడ్డిలకు పీఆర్టీయూ మొయినాబాద్ మండల శాఖ సన్మానం చేసింది.
ఈ కార్యక్రమంలో ఆమ్డాపూర్ పాఠశాల జీహెచ్ ఎం రేణుక, మండల విద్యాధికారి వెంకటయ్య, మండల నోడల్ అధికారి మల్లయ్య, సత్యనారాయణరెడ్డి, ఆంజనేయులు, వెంకటయ్య, శివకుమార్, యాదగిరి, రాములు, వేణుగోపాల్, సంజీవన్ కుమార్, లక్ష్మణ్, వినోద్ కుమార్, నారాయణ, బీమ్లా నాయక్, మంజుల, విజయ బాయి, కవితా రాణి, ఉమారాణి, శ్రీలత, రేష్మ, రాములు నాయక్ శేర్లింగంపల్లి మండలం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హనుమంతు రవీందర్ రెడ్డి, సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్ ఆంజనేయులు, జీహెచ్ఎంలు రాములు, లక్ష్మారెడ్డి మండల ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.