పదోన్నతి అధికారికి సన్మానం
Honor to the promoted officer
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: కోల్ బెల్ట్ మందమర్రి ఏరియా సింగరేణి ఎస్ అండ్ పీసీ విభాగంలో జమిందార్ గా విధులు నిర్వర్తించిన డి.నారాయణ రెడ్డి భూపాలపల్లి ఎస్ అండ్ పీసీ జూనియర్ ఇన్స్ పెక్టర్ గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా శనివారం పలువురు సిబ్బంది నారాయణరెడ్డిని సన్మానించి వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంజీవ్, మర్రి శ్రీకాంత్, అల్లంల ప్రశాంత్, తుంగపిండి శ్రీనివాస్, లక్ష్మణ్, రమణ, అశోక్, శ్రీకాంత్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.