పారంపర్య వైద్యుల శిబిరం
వైద్యులకు శిక్షణ, ఔషధమొక్కల ప్రదర్శన
నా తెలంగాణ, యాదగిరిగుట్ట : తెలంగాణ పారంపర్య వైద్య మహా సంఘం ఆధ్వర్యంలో సోమవారం యాదగిరిగుట్టలో జరిగిన శిక్షణ శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. సుమారు 250 మంది వైద్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా హాజరైన పల్లె సృజన అధినేత పోగుల గణేష్, రిటైర్డ్ ఆయుర్వేదిక్ ఆఫీసర్ జకోటియా మాట్లాడారు.
పూర్వం నుంచి అనేక ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులు సంప్రదాయ వైద్యులు తమ వైద్య సేవలను ఎంతో మానవతా విలువలతో అరుదైన వనమూలికలతో వైద్యం చేస్తూ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు. జీవ వైవిధ్యాన్ని కాపాడే మూలికలని వినియోగిస్తూ వాటిని పెంచుతూ రక్షిస్తూ ప్రకృతికి కూడా పరంపర వైద్యులు ఎంతో మేలు చేస్తున్నట్టు ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
దాడులు ఆపాలి : పారంపర్య వైద్య సంఘం
ఆయుర్వేద వైద్యుల్ని గుర్తించాలని, వారిపై అధికారులు దాడులు ఆపివేయాలని పారంపర్య వైద్య సంఘం అధ్యక్షులు యాత్రి మహా రుషి, కార్యదర్శి నరసయ్య, గౌరవ అధ్యక్షులు సజ్జన రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరి సింహాచలం లక్ష్మణ స్వామి ప్రభుత్వాన్ని కోరారు. ఈ శిబిరంలో దాదాపు 350 మొక్కలకు పైగా ఫ్లెక్సీలు లైవ్ గా ప్రదర్శించారు వాటి ఔషధ విలువలను ప్రత్యేకంగా వచ్చిన వైద్యులందరికీ వివరించారు. వెయ్యి మొక్కలకు పైగా ఒక ఆల్బమ్ రూపొందించి మొక్కలు గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టారు.