ఋణమాఫీపై అధైర్యపడొద్దు
వ్యవసాయాధికారి శ్రీకర్
నా తెలంగాణ, బాసర: బాసర మండల రైతలు రుణమాఫీ కానీ వారు అధైర్య పడొద్దని ప్రభుత్వం ఇచ్చిన మాటకి కట్టుబడి ఉందని మంగళవారం నోడల్ ఆఫీసర్ గా బాసర రైతు వేదికకు విచ్చేసిన వ్యవసాయాధికారి శ్రీకర్ తెలిపారు. అధికారి శ్రీకర్ ను బాసర మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఎం. రమేష్, బీసీ సెల్ అధ్యక్షులు జంగం రమేష్ లు సన్మానించారు. ఎం. రమేష్ మాట్లాడుతూ.. 17వేల కోట్ల రూపాయలు 23 లక్షల ఖాతాలలో జమ చేశామన్నారు. 14వేల కోట్ల రూపాయలు 16 లక్షల ఖాతాలకు జమ చేస్తామన్నారు. రైతులు అపోహలను నమ్మవద్దన్నారు.
ఋణమాఫీ విషయంలో పారదర్శకంగా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఋణమాఫీ అయిన లిస్టును గతంలో ఏ ప్రభుత్వం విడుదల చేయలేదని కానీ తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని రమేష్ తెలిపారు.