ప్రతీ ఒక్కరి జీవితంలో ధ్యానం భాగం కావాలి

Meditation should be a part of everyone's life

Dec 21, 2024 - 17:50
 0
ప్రతీ ఒక్కరి జీవితంలో ధ్యానం భాగం కావాలి

అంతర్జాతీయ ధ్యాన దినోత్సవంలో ప్రధాని మోదీ పిలుపు

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: ధ్యానం ప్రతీ ఒక్కరి దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం 21 డిసెంబర్​ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలకు సందేశమిచ్చారు. సమాజంలో శాంతి, సామరస్యాల పెంపుదలకు ధ్యానం ఒక శక్తివంతమైన మార్గమన్నారు. ప్రస్తుత ఉరుకులు, పరుగులు జీవితంలో ధ్యానంతో ప్రశాంతత లభిస్తుందన్నారు. టెక్నాలజీ, యాప్​ లు, కంప్యూటర్లు, వీడియోలు అంటూ సాంకేతికత వైపు పరుగుతీస్తున్న ప్రపంచానికి ధ్యానం ద్వారా ఊరట, మనశ్శాంతి లభిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.