జూన్ 27న కల్కి వస్తాడు

He will come to Kalki on June 27

Apr 28, 2024 - 16:32
 0
జూన్ 27న కల్కి వస్తాడు
2024 మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా (వ‌ర‌ల్డ్) మూవీ 'కల్కి 2898 AD' రిలీజ్ తేదీపై డైల‌మా కొన‌సాగుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది మేలో ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉన్నా కానీ, ప్ర‌స్తుత ఎల‌క్ష‌న్ హంగామా నేప‌థ్యంలో రిలీజ్ డేట్ మారింది. 27 జూన్ 2024 తేదీని ఎట్ట‌కేల‌కు అధికారికంగా చిత్ర‌బృందం ప్ర‌క‌టించింది. క‌ల్కి అన్ని ప‌నులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ప్ర‌భాస్, దీపిక ప‌దుకొనే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అతిపెద్ద కాస్టింగ్ ఈ సినిమాకి ప్ర‌ధాన బ‌లం. దీపికా పదుకొణె, దిశా పటానీ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.  ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన అన్ని పోస్ట‌ర్లు ప్రోమోలు ఆక‌ట్టుకున్నాయి. భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా ఉంటుందో ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ తెర‌పై ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. భార‌తీయ సినీచ‌రిత్ర‌లో ఈ త‌ర‌హా సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం రావ‌డం ఇదే మొద‌టిసారి అని కూడా చాలా మంది ప్ర‌ముఖులు చెబుతున్నారు. అందుకే క‌ల్కి విడుదల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులను ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిగ్గా రిలీజ్ కి రెండు నెలల ముందు ఈరోజు చేసిన ప్రకటన ప్రాజెక్ట్ పై మరింత ఉత్కంఠ‌ను పెంచింది. సోషల్ మీడియాలో మేక‌ర్స్ రిలీజ్ తేదీని ఖ‌రారు చేయ‌డంతో ఇప్పుడు అభిమానుల్లో హంగామా షురూ అయింది. డార్లింగ్ ప్ర‌భాస్ బాహుబ‌లి 2తో నెల‌కొల్పిన త‌న రికార్డుల‌ను తానే బ్రేక్ చేస్తాడ‌ని, ప్ర‌పంచ‌వ్యాప్త రిలీజ్ తో దంగ‌ల్ రికార్డుల‌ను కూడా కొట్టేస్తాడని ర‌క‌ర‌కాలుగా అంచ‌నా వేస్తున్నారు.