కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
Distribution of Kalyana Lakshmi and Shadi Mubarak cheques
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: మందమర్రి మండలంలో 58 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గురువారం ఎంపీడీవో కార్యాలయంలో పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలో భాగంగా అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఇప్పటికే రెండు కార్యక్రమాలు అమలు చేశామన్నారు. అలాగే కొత్త గనులను ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మీ, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, జడ్పీటీసీ వేల్పుల రవి, క్యాతన్ పల్లి పుర చైర్మన్ జంగం కళ, ఎంపీపీ మంగ తదితరులు పాల్గొన్నారు.