ఒక్క చాన్స్ ఇవ్వండి ప్రశ్నించే గొంతుకనవుత
– బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి
నా తెలంగాణ, నల్గొండ: తనకు ఒక్క అవకాశం ఇస్తే.. అన్ని వర్గాల తరఫున చట్టసభలో ప్రశ్నించే గొంతుకనవుతానని ఖమ్మం, నల్గొండ , వరంగల్ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం నల్గొండ జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి మాట్లాడారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక వైఖరిని ఎండగట్టడానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తనకు మద్దతుగా నిలిచి తొలి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు సానుకూలంగా స్పందించి మద్ధతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.