ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
Married suicide by hanging
నా తెలంగాణ, రామకృష్ణాపూర్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన రామకృష్ణాపూర్ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విషయం గమనించిన చుట్టుపక్కలన వాళ్ళు108, పోలీసులకు సమాచారం ఇచ్చారు. 108 సిబ్బంది వివాహిత అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. రామాలయంలో రామ్ నగర్ కు చెందిన పైడాకుల రాజుకు మందమర్రికి చెందిన తేజస్వి తో సుమారు 15 ఏళ్ళ క్రితం వివాహమైంది. తేజస్వి (28)ఇంట్లో ఎవరు లేనిసమయంలో ఇంటి పైకప్పు పైపుకు చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటికి వచ్చిన భర్త రాజు ఎంతకు డోర్ కొట్టినా తీయకపోవడంతో రాజు గుణపంతో డోర్ ను పగలగొట్టి చూడగా తేజస్వి ఉరివేసుకుని విగత జీవిగా వేలాడుతుందని తెలిపారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశిలించారు. ఆత్మహత్య కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నట్లు రెండో పట్టణ ఎస్సై రజిత తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలికి భర్త రాజు తోపాటు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు.