నా తెలంగాణ, నిర్మల్: విద్యాశాఖకు అనుసంధానంగా పని చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు జిల్లా విద్యాధికారి రామారావుకు సమ్మె నోటీసు ఇచ్చారు. గత సంవత్సరం ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ వారు నోటీసు ఇచ్చారు. 15 రోజులలో ప్రభుత్వం చర్చలకు పిలిచి హామీలు నెరవేర్చాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలోని అన్ని విభాగాలకు చెందినవారు నిరవధిక సమ్మె లో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల జేఏసీ జిల్లా అధ్యక్షులు భూసారపు గంగాధర్, ప్రధాన కార్యదర్శి గాంధారి రత్నం, ఠాకూర్ గజేందర్ సింగ్, కప్పకంటి సుధాకర్, స్నేహ, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు