ప్రధానికి రెడ్ కార్పెట్ స్వాగతం
Red carpet welcome to the Prime Minister
ప్రవాస భారతీయుల ఘన స్వాగతం
అరబిక్ రామాయణ, మహాభారత్ లపై మోదీ సిగ్నేచర్
అల్ అసిమా గవర్నెట్: రామాయణ, మహాభారతాల చరిత్ర గల పుణ్యభూమి భారత్ నుంచి విచ్చేసిన ప్రధాని నరేంద్ర మోదీని కలవడం తమకెంతో సంతోషాన్నిచ్చిందని అరబిక్ భాషలో వీటిని అనువదించిన కువైట్ ప్రచురణకర్తలు లతీఫ్ అల్నెసెఫ్, అబ్దుల్లా బారన్ లు హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రచురణల పట్ల ప్రధాని మోదీ వీరిని అభినందిస్తూ అనువాదాలపై సంతకాలు చేశారు. శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ కు చేరుకున్నారు. ప్రధానికి ఉప ప్రధాన మంత్రి షేక్ ఫహద్ యూసఫ్ సౌద్ అల్-సబాహ్, పలువురు మంత్రులు, ప్రముఖులు విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు.
అనంతరం ప్రధానమంత్రికి విమానాశ్రయం లాంజ్‌లో
భారతీయులు స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ కూడా వారిని ఉత్సాహపరిచారు. పలువురితో మాట్లాడారు. అనంతరం 101ఏళ్ల మాజీ ఐఎఫ్ ఎస్ (ఇండియన్ ఫారిన్ సర్వీస్) అధికారి మంగళ్ సైన్ హండాతో ప్రధాని సమావేశమయ్యారు. ప్రధానిని కలవడం ఎంతో సంతోషకరమని హండా కుమారుడు దిలీప్ హండా అన్నారు. తన తండ్రిని, ప్రధాని మోదీని కలిసేందుకు వచ్చానని, ఆయన్ను కలవడం, మాట్లాడటం తనకు ఎంతో గొప్ప అనుభూతినిచ్చిందన్నారు.
కువైట్ తో స్థానిక కరెన్సీ ద్వారానే వ్యాపారం..
కువైట్ ఎమిర్ షేక్ మెషల్ అల్ అహ్మద్ అల్ జబర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాని కువైట్ లో రెండు రోజుల పర్యటనకు విచ్చేశారు. 43యేళ్ల తరువాత భారత్ నుంచి ప్రధాని మోదీ ఉండటం ఇదే తొలిసారి. కువైట్ స్వాతంత్రయాన్ని గుర్తించిన తొలి దేశం భారత్. ఇరుదేశాల మధ్య 1961 తరువాత అనేక రంగాల్లో బంధాలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో భారత్ కు ప్రధాన చమురు సరఫరాదారుల్లో కువైట్ ఆరో దేశంగా ఉంది. చమురు సరఫరాలను ( భారత్ యూపీఐ స్థానిక కరెన్సీ–రూపాయి) ద్వారా చేపడుతుంది.
ప్రధాని మోదీ పోస్ట్..
తన కువైట్ పర్యటన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. నిస్సందేహంగా భారత్ – కువైట్ వివిధ రంగాల్లో స్నేహబంధాన్ని, వాణిజ్య, వ్యాపార బంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆకాంక్షించారు. పశ్చిమాసియాలో శాంతి, భద్రత, సుస్థిరతపై భారతదేశం, కువైట్ ఆసక్తులను పంచుకున్నాయి. కువైట్‌తో తరతరాలుగా పెంపొందించుకున్న చరిత్రాత్మక సంబంధాన్ని మేము ఎంతో విలువైనదిగా కోరుకుంటున్నాము.