చెప్తే వినలేదని.. విద్యార్థుల జుట్టు కత్తిరించిన టీచర్
The teacher who cut the hair of the students did not listen
నా తెలంగాణ, ఖమ్మం : జుట్టు పెంచుకొని పాఠశాలకు వస్తున్నారంటూ ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలు శిరీష విద్యార్థుల జుట్టు కత్తిరించిన ఘటన శనివారం ఖమ్మం జిల్లా కల్లూరు మండలం పేరువంచ జడ్పీహెచ్‌ఎస్‌లో జరిగింది. పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఇలా చేయడం ఏమిటని, అవమానభారంతో పిల్లలు ఏమైనా చేసుకుంటే ఎవరు బాధ్యత వహించాలని తల్లిదండ్రులు ప్రశ్నించారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఉపాధ్యాయురాలు చేసిన నిర్వాకానికి తమ పిల్లలకు పూర్తిగా గుండు కొట్టించాల్సి వచ్చిందని తల్లిదండ్రులు చెప్పారు. విషయం తెలుసుకున్న డీఈఓ సోమశేఖరశర్మ సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు.