మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

Financial assistance to the family of the deceased

Sep 6, 2024 - 17:44
 0
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

నా తెలంగాణ, షాద్ నగర్: షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల పరిధిలోని కాకునూరు గ్రామానికి చెందిన పల్లె శివలింగం అనారోగ్యంతో గురువారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి మృతుని కుటుంబానికి శుక్రవారం ఆర్థిక సహాయం అందజేశారు. కాంగ్రెస్ నాయకులు 10వేలు, బీఆర్ఎస్ నాయకులు 11వేలు ఆర్థిక సాయంగా అందజేశారు. ఆయా కార్యక్రమాలలో సింగిడి మల్లారెడ్డి, గండ్ర జగదీశ్వర్ గౌడ్, సింగిడి జంగారెడ్డి, తైద పర్వతాలు, కోడూరు రాములు, సీమల శ్రీనివాస్, కోడూరు శ్రీశైలం, పి.లింగం, గోపని భీమయ్య, కోటీశ్వర్, ఆరె రాఘవేందర్, వి.శ్రీనివాస్, కృష్ణ  తదితరులు పాల్గొన్నారు.