భారత్ లో ఓటేసే అర్హత లేదు వీళ్లకు

They are not eligible to vote in India

Apr 28, 2024 - 16:29
 0
భారత్ లో ఓటేసే అర్హత లేదు వీళ్లకు
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఏడు వేర్వేరు దశల్లో జరగనున్నాయి. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 19వ తేదీ శుక్రవారంతో 102 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. తమిళనాడు మొదటి దశ ఎన్నికలలో పోలింగ్ లో రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ కుమార్ మరియు ధనుష్‌లతో సహా పలువురు తమిళ సినీ ప్రముఖులు ఓట్లు వేసారు. మహారాష్ట్రలో తొలి ఐదు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 20న ముంబైలో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. బాలీవుడ్ ప్ర‌ముఖులంతా తమ ఓటు వేయడానికి తరలివస్తారు. అయితే ఈ ఎన్నికల రోజున కొందరు బాలీవుడ్ నటీమణులు ఓట్లు వేయలేరనే సంగ‌తి తెలుసా? స‌ద‌రు న‌టీమ‌ణులు ఎవ‌రెవ‌రు? ఎన్నికలలో భాగం కాలేకపోవడానికి కారణమేమిటో తెలిస్తే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.
 
అలియా భట్ 

అలియా భట్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ల‌లో ఒకరు. త‌ను భారత సంతతికి చెందినప్పటికీ, భారత పౌరసత్వం లేదు. బదులుగా బ్రిటిష్ పౌరసత్వం ఉంది. ఆమె తల్లి సోనీ రజ్దాన్ బర్మింగ్‌హామ్‌లో జన్మించారు. ఆమెకు కూడా ఓటు హ‌క్కు లేదు. సోని రజ్ధానీ భారత పౌరురాలు కానందున ఎన్నికల్లో ఓటు వేయడానికి చట్టం అనుమతించదు.
 
 కత్రినా కైఫ్ 

కత్రినా కైఫ్‌కు భారతీయ పౌరసత్వం కాకుండా బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది. కత్రినా కైఫ్ బ్రిటిష్ హాంకాంగ్‌లో జన్మించింది. తండ్రి మహమ్మద్ కైఫ్ కాశ్మీరీ సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త.. తల్లి సుసన్నా ఒక ఆంగ్ల న్యాయవాది.. స్వచ్ఛంద సంస్థ నిర్వాహ‌కురాలు. అందుకే క‌త్రిన‌ హిందీ సినిమాల్లో కెరీర్ వెతుక్కుంది. కానీ త‌నకు ఓటు వేసే హ‌క్కు లేదు. 
 
 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ 

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ బహ్రెయిన్‌లో శ్రీలంకన్ తండ్రి .. మలేషియా తల్లికి జన్మించింది. ఆమెకు శ్రీలంక పౌరసత్వం ఉంది కాబట్టి ఆమెకు భారతదేశంలో ఓటు హక్కు లేదు. 
నోరా ఫతేహి 

భారతీయ సినీ ప‌రిశ్ర‌మ‌ల్లో తనకంటూ ఒక పేరు తెచ్చుకున్న నోరా ఫతేహి తల్లిదండ్రులు ఇద్దరూ మొరాకోకు చెందినవారు. తను మొరాకో సంతతికి చెందినవారు. అయితే కెనడియన్ పౌరసత్వాన్ని కూడా కలిగి ఉంది. అందువల్ల భారతదేశంలో ఓటు వేయలేరు. 

 
ఎమీజాక్స‌న్, న‌ర్గీస్ ఫ‌క్రి, స‌న్నీలియోన్, క‌ల్కి కొచ్లిన్, ఇలియానా వంటి మ‌రికొంద‌రు క‌థానాయిక‌లు కూడా భార‌త‌దేశంలో త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోలేరు. ఎమీ బ్రిటీష్ పౌర‌స‌త్వం ఉన్న న‌టి. న‌ర్గీస్ ఫ‌క్రీ అమెరిక‌న్... స‌న్నీలియోన్ కి కెన‌డియ‌న్ అమెరిక‌న్ పౌర‌స‌త్వం ఉంది. క‌ల్కి కొచ్లిన్ కి ఫ్రెంచి పౌర‌స‌త్వం ఉంది. గోవా బ్యూటీ ఇలియానాకు పోర్చ్ గీస్ పౌర‌స‌త్వం ఉంది. కానీ భార‌తీయ పౌర‌స‌త్వం లేదు. అందుకే ఇక్క‌డ ఓటు వేయ‌లేదు.