అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని హిందూ సంఘాల డిమాండ్
బస్టాండ్ లోని అక్రమ నిర్మాణాల కూల్చివేత
అర్థరాత్రి వరకు ఎమ్మెల్యే భైఠాయింపు
పత్రాలు చూపాలని మసీదు కమిటీకి అధికారుల నోటీసులు
చర్యలు చేపట్టకుంటే ఆందోళన విరమించమంటున్న హిందూ సంఘాలు
జైపూర్: రాజస్థాన్ భిల్వారా జహజ్ పూర్ జామా మసీదు నుంచి రాళ్లు రువ్విన ఘటనపై ఆదివారం కూడా హిందూ సంఘాలు ఆ ప్రాంతంలో ఆందోళన కొనసాగిస్తున్నాయి. శనివారం ఈ ప్రాంతం ఏకాదశి శోభాయాత్ర కొనసాగుతుండగా మసీదు నుంచి పెద్ద యెత్తున రాళ్ల దాడి జరిగింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఊరేగింపులోని పలువురు హిందువులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న దుకాణాలు మూతపడ్డాయి. వీడియోల్లో మసీదు నుంచి దుండగులు రాళ్లు విసిరిన వీడియోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
దాడి అనంతరం పెద్ద యెత్తున సంఘటనా స్థలానికి హిందూసంఘాలు, స్థానిక ఎమ్మెల్యే గోపీచంద్ మీనా ఆందోళనకు దిగారు. వెంటనే దాడులు చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలని, అక్రమ నిర్మాణమైన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేశారు. మధ్యరాత్రివరకూ ధర్నా నిర్వహించారు.
దాడుల అనంతరం అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. జహజ్ పూర్ మున్సిపల్ కార్పొరేషన్ వెంటనే మసీదుకు నోటీసులు జారీ చేసింది. మసీదు నిర్మాణానికి సంబంధించిన పత్రాలను అందజేయాలని పేర్కొంది. ఇందుకు 24 గంటలపాటు సమయమిచ్చింది. దాడులకు పాల్పడిన 10మందిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
హిందూసంఘాల ఆందోళనలు మసీదును వెంటనే కూల్చివేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణంపై నుంచి రాళ్లు విసరడం వీరికి పరిపాటిగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు మసీదు కూల్చకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
హిందూసంఘాల ఆందోళనతో అధికార యంత్రాంగం స్థానిక బస్టాండులో ఉన్న కొన్ని అక్రమ షెడ్డులను కూల్చివేసింది. మసీదు పత్రాలు చూసిన అనంతరం చర్యలు చేపడతామని పేర్కొంది.