మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది

Mega family support is good

Apr 28, 2024 - 16:38
 0
మెగా ఫ్యామిలీ సపోర్ట్ బాగానే ఉంది
మొత్తానికి జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ రంగంలోకి దిగుతున్న‌ట్లే క‌నిపిస్తుంది. ఎన్నిక‌ల‌కు ఇంకా ప‌దిహేను రోజులే స‌మ‌యం ఉండ‌టంతో? మెగా ఫ్యామిలీ హీరోలు ఒక్కొక్క‌రుగా తెర‌పైకి వస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ప‌వ‌న్ కోసం స్టార్ క్యాంపెన‌ర్లుగా హైపర్ ఆది, గెటప్ శీను, ఆర్కే నాయుడు, జానీ మాస్టర్ వంటి వాళ్లు జోరుగా ప్రచారం చేస్తున్నారు. పిఠాపురంతో పాటు ప‌వ‌న్ అభ్య‌ర్దులు పోటీ చేస్తున్న మిగ‌తా 20 నియోజ‌క వ‌ర్గాల్లోనూ ప్ర‌చారం చేస్తున్నారు. తాజాగా బాబాయ్ కోసం అబ్బాయి వ‌రుణ్ తేజ్ కూడా రంగంలోకి దిగేసాడు.  తాజాగా వ‌రుణ్ తేజ్ పిఠాపురంలో  ప్రచారం చేయబోతున్నట్లు జనసేన ప్రకటించింది. ఈ విషయాన్ని నాగబాబు తన సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. అలాగే జ‌న‌సేన కార్యాల‌యం నుంచి అధికారికంగా ఓ లేఖ కూడా రిలీజ్ అయింది. గొల్ల ప్రోలు రూర‌ల్ మండ‌లం తాటిప‌ర్తి లో మ‌ధ్నాహ్నం మూడు గంట‌ల‌కు ప్ర‌చారం మొద‌లు పెట్టి వ‌న్నెపూడి మీదుగా కొడ‌వ‌లి, చందుర్తి మీదుగా దుర్గాడ చేరుకుంటారు. ప్ర‌చార ర్యాలీ..రోడ్ షోల‌లో వ‌రుణ్ ప్ర‌సంగిస్తాడు. ప్రస్తుతానికి అయితే మెగా ఫ్యామిలీ నుంచి వరుణ్ తేజ్ మాత్రమే ప్రచారానికి రానున్నట్లు తెలుస్తుంది. పోలింగ్ దగ్గర పడే కొద్ది మరికొంతమంది మెగా హీరోలు కూడా పవన్ కళ్యాణ్ కోసం ప్రచారానికి వచ్చే అవకాశం ఉందని జనసేన కార్యకర్తలు విశ్వ‌శిస్తున్నారు. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి కూడా త‌మ్ముడు కోసం కండువా క‌ప్పుకుని సీన్ లోకి వ‌స్తార‌ని జోరుగా ప్ర‌చారం సాగుతోంది. ఇప్ప‌టికే సీఎం ర‌మేష్‌..పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబుల‌ను చిరంజీవి ప‌క్క‌నే కూర్చోబెట్టుకుని కూట‌మిని గెలిపించాల‌ని ఓ వీడియో చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. వాళ్లిద్ద‌ర్నే ప‌క్క‌న కూర్చోబెట్టుకుని ప్ర‌చారం చేసిన చిరంజీవి త‌మ్ముడు కోసం ఎందుకు పార్టీ కండువా క‌ప్పుకోరు? అని అభిమానులు...జ‌న‌సైనికులు బ‌లంగా న‌మ్ముతున్నారు. మ‌రి ఈ ప‌దిరోజుల్లో అది సాధ్య‌మ‌వుతుందా? లేదా? అన్న‌ది చూడాలి. అలాగే పిలిస్తే నేను సైతం అంటూ రామ్ చ‌ర‌ణ్ ఎప్పుడో సిద్ద‌మై ఉన్నాడు. ప‌వ‌న్ పిలుపు కోసం వెయిట్ చేస్తున్నాడు.