హర్దా బాణాసంచా పేలుడు.. 11మంది మృతి, 217 మందికి గాయాలు
మధ్యప్రదేశ్ లోని హర్దాలో బుధవారం బాణాసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 11 మంది గాయపడగా 51 మంది కార్మికులు సహా మొత్తం 217 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు గురువారం మీడియాకు వివరించాయి.
ఇండోర్: మధ్యప్రదేశ్ లోని హర్దాలో బుధవారం బాణాసంచా ఫ్యాక్టరీలో సంభవించిన పేలుడులో 11 మంది గాయపడగా 51 మంది కార్మికులు సహా మొత్తం 217 మందికి గాయాలైనట్లు అధికార వర్గాలు గురువారం మీడియాకు వివరించాయి. గాయపడిన 73 మందిని హర్ధా, ఇండోర్, భోపాల్, నర్మదాపూర్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, మరో 38 మంది హర్ధాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 95 మంది స్వల్ప గాయాలకు చికిత్సనందించి డిశ్చార్జీ చేసినట్లు తెలిపారు.
బాణాసంచా ఫ్యాక్టరీలో అండర్ గ్రౌండ్ లో భారీగా గన్ పౌడర్ నిల్వ ఉండడంతో పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వివరించారు. అక్కడే కార్మికులు కూడా పనిచేస్తుండడంతో పేలుడు ప్రాణనష్టం ఎక్కువగా వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు.
స్థానికుల ఆరోపణలు.. సీఎం సీరియస్..
కాగా అనేకమార్లు స్థానికంగా బాణాసంచా వల్ల పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదనే వార్తల నేపథ్యంలో సీఎం మోహన్ యాదవ్ సీరియస్ అయ్యారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి వెంటనే నివేదిక అందజేయాలని కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల పరిహారం ప్రకటించి, క్షతగాత్రులకయ్యే చికిత్స ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. మరోమారు ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు చేపడతామన్నారు.