వాజ్ పేయి శతజయంతి.. సేవా కార్యక్రమాల్లో కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి
Vajpayee centenary.. Union Minister G. Kishan Reddy in service programs
నా తెలంగాణ, హైదరాబాద్: అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి సందర్భంగా పలు తెలంగాణ రాష్ర్ట బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి పలుసేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలోని రోగులను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న వైద్యంపై ఆరా తీశారు. వారికి పండ్లను పంపిణీ చేశారు. అంతకుముందు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్ పేయికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బాబా సాహేబ్ డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.