త్రిపురలో అక్రమ ప్రవేశం 7 బంగ్లా, 2రోహింగ్యాల అరెస్ట్
Illegal entry of 7 bungalows in Tripura, arrest of 2 Rohingyas
త్రిపుర: త్రిపురలో అక్రమంగా ప్రవేశించిన ఏడుగురు బంగ్లాదేశీ, ఇద్దరు రోహింగ్యాలను సరిహద్దు భద్రత దళాలు ఆదివారం అదుపులోకి తీసుకున్నాయి. త్రిపురలోని ఖోవై జిల్లాలోని రంగిచెర బోర్డర్ ఔట్ పోస్ట్ నుంచి సరిహద్దు కంచెను దాటుతున్న సమయంలో సరిహద్దు కాపలా దళాలు ఒక మహిళ, ఒక బాలికతో సహా ముగ్గురు బంగ్లాదేశ్ జాతీయులను పట్టుకున్నాయని బీఎస్ ఎఫ్ అధికారులు తెలిపారు. వారి సహచరులు ఇద్దరు ఇప్పటికే సరిహద్దు కంచెను దాటి బాగిచెర్ర గ్రామం వైపు వెళ్లినట్లు గుర్తించామన్నారు. పోలీసుల సహకారంతో వారిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. బంగ్లాలోని కాక్స్ బజార్ శిబిరాల నుంచి రోహింగ్యాలు అక్రమంగా భారత్ లోకి ప్రవేశిస్తున్నట్లు తెలిపారు.
గత మూడు నెలలుగా 310 మందికి పైగా బంగ్లాదేశీయులు, 34 మంది రోహింగ్యాలను జీఆర్పీ, త్రిపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.