సీఎం హాజరుకు కోర్టు ఆదేశాలు
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత ఈడీ విచారణకు హాజరుకావడం లేదంటూ కోర్టు వేసిన పిటిషన్లపై రావూస్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో హాజరుకావాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది.
నా తెలంగాణ, న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత ఈడీ విచారణకు హాజరుకావడం లేదంటూ కోర్టు వేసిన పిటిషన్లపై రావూస్ ఎవెన్యూ కోర్టు అరవింద్ కేజ్రీవాల్ కోర్టులో హాజరుకావాలని గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ కు మరో సంకటం ఎదురైనట్లయ్యింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో విచారణకు హాజరుకావాలంటూ ఐదుసార్లు నోటీసులు జారీ చేసినా సీఎం కేజ్రీవాల్ హాజరుకావడం లేదంటూ పిటిషన్ లో పేర్కొంది. కుంభకోణానికి సంబంధించి పలు విషయాలపై విచారణ జరపాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కానీ సీఎం తమ నోటీసులను బేఖాతరు చేస్తున్నట్లు కనబడుతోందని కోర్టులో వేసిన పిటిషన్ లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్పందించింది. కోర్టు ఆదేశాలందాయని పేర్కొంది. ఈడీ పంపిన నోటీసులన్ని చట్టపరమైనవి కావని, తాము కోర్టుకు చట్టపరంగానే నివేదిస్తామని పేర్కొంది.
ఈడీ నోటీసులు..
మొదటిసారిగా ఈడీ 2023 నవంబర్ 2న, రెండోసారి 2023 డిసెంబర్ 21న, మూడోసారి 2023 జనవరి 24న, నాలుగోసారి 2024 జనవరి 18న, ఐదోసారి 2024 ఫిబ్రవరి 2న నోటీసులు జారీ చేసింది. పలువురు మద్యం వ్యాపారులకు మేలు చేకూర్చేందుకు వారికి అనుకూల నిర్ణయాలతో అబ్కారీ లైసెన్సులను జారీ చేశారనే ఆరోపణలు సీఎం కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.