స్టేషన్ లో పోలీస్ ను కొట్టిన వ్యక్తి
The man who beat the police in the station
సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు
రాజకీయ పలుకుబడే కారణం
నిందితుడికి 14 రోజుల రిమాండ్
బెంగళూర్: కర్ణాటక మాండ్య పోలీస్ స్టేషన్ లో పోలీస్ ను ఓ వ్యక్తి కొడుతున్న వీడియో కాస్త సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలకు తావిస్తుంది. ఆదివారం ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. భూ వివాదం సందర్భంగా మునిసిపల్ మాజీ చైర్మన్ కుమారుడు పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడిని కానిస్టేబుల్ ప్రశ్నిస్తూ ఇరువురు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో కానిస్టేబుల్ ముందుగా అతనిపై చేయి చేసుకున్నాడు. చొక్కా కాలర్ పట్టుకొని చెంప దెబ్బకొట్టాడు. దీంతో రెచ్చిపోయిన వ్యక్తి కానిస్టేబుల్ ను తిరిగి కొట్టాడు. బూతులు తిట్టాడు. చొక్కా పట్టుకున్నాడు. వివాదాన్ని గమనించిన ఇతర కానిస్టేబుళ్లు ఆపేందుకు రాగా ఆ కానిస్టేబుల్ చొక్కాను కూడా మాజీ చైర్మన్ కుమారుడు పట్టుకున్నాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు కోర్టుకు తరలించగా కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ ను విధించింది.
కాగా ఈ ఘటనపై సోషల్ మాధ్యమంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ పై చేయి చేసుకున్నాడంటే ఇతని గుండె ధైర్యం ఎక్కువే అని కొందరు అంటుంటే మరికొందరూ పోలీసులకు సేఫ్టీ కరవైతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది విచారణ సందర్భంగా వచ్చిన వ్యక్తిని కొట్టడం ముందుగా పోలీసు చేసిన తప్పని అభివర్ణిస్తున్నారు. మరీ పోలీస్ కు శిక్ష ఏదని నిలదీస్తున్నారు. ఏది ఏమైనా అక్కడ తప్పేవరిదనే విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అయినా పోలీసు విచారణలో నిందితుడు పోలీసును కొట్టడం వెనుక రాజకీయ పలుకుబడే కారణంగా తెలుస్తుంది.