అదానీ వృద్ధి 17.5 శాతం
Adani's growth was 17.5 percent
ప్రతికూలతలను దాటుతుంది
ఈబీఐటీడీఎ నివేదిక
నా తెలంగాణ, సెంట్రల్ డెస్క్: ఎన్నోఆరోపణలు, ఎన్నో విమర్శలు, ఎన్నో ప్రతికూలతలున్నా అదానీ ఎంటర్ ప్రైజెస్ 2024–27 ఆర్థిక సంవత్సరాల్లో 17.5 శాతం వృద్దిని కనబరుస్తుందని ‘ఎర్నింగ్స్ బీఫోర్ ఇంట్రస్ట్, ట్యాక్సెస్ డిప్రిషియేషన్ అండ్ అమెర్టైజేషన్ (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు--–ఈబీఐటీడీఎ) నివేదిక పేర్కొంది.
17.5 శాతం వృద్ధితో రూ 1, 15, 343 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. ఈ కాలంలో సంస్థ నికర లాభం యేట 45.8 శాతం పెరుగుతుందని నివేదిక వెల్లడించింది. పోర్ట్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ అదానీ టోటల్ గ్యాస్, పవర్ ట్రాన్స్‌మిషన్ కంపెనీ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, కమోడిటీ కంపెనీ అదానీ విల్మార్ లు వృద్ధిరేటులో ఉంటాయని వివరించాయి. అనేక ఆరోపణలున్నా 2024–25లో స్టాక్ మార్కెట్ లో సంస్థ అస్థిరతలో ఉన్నప్పటికీ సంస్థ పనితీరు భేషుగ్గా ఉంది. దీంతో పెట్టుబడిదారుల్లో నమ్మకం, విశ్వాసాన్ని చూరగొనగలిగిందని నరివేదిక వెల్లడించింది. 101.5 ఎండబ్ల్యూ ఎలక్ట్రోలైజర్ తయారీ సౌకర్యం కోసం సైట్ (ఎస్ఐటీఇ) పథకం కింద ఎస్ ఈసీఐ నుంచి కాంట్రాక్టును దక్కించుకుంది. మహారాష్ర్ట ధారవి రీడెవలప్ మెంట్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ పేరును నవభారత్ మెగా డెవలపర్స్ గా మార్చింది. ఈ ప్రాజెక్టు ధారవిలోని మురికివాడల్లో బహుళ అంతస్థుల భవనాలను నిర్మించి ప్రస్తుతం అక్కడ నివసించే వారికే అందజేయనుంది. ఈ ప్రాజెక్టుకు మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో అదానీ సంస్థ 80 శాతం డబ్బును వెచ్చించనుండగా, 20 శాతం రాష్ర్టం వెచ్చించనుంది. మరోవైపు న్యూయార్క్ లోని 620 ఎకరాల ప్రైమ్ ల్యాండ్ లో విలాసవంతమైన అర్భన్ హబ్ గా మార్చేందుకు అదానీ సంస్థ సిద్ధమైంది. పేరు మార్చుకున్న సంస్థ నిర్దేశించుకున్న లక్ష్యాలపై మరింత పట్టుదలతో పనిచేస్తుందని ఈబీఐటీడీఎ నివేదిక పేర్కొంది.