హిజ్బొల్లాకు అర్థమయ్యేట్లు చెబుతాం

ఇజ్రాయెల్​ ప్రధాని నెతన్యాహు సంచలన ప్రకటన

Sep 22, 2024 - 18:45
 0
హిజ్బొల్లాకు అర్థమయ్యేట్లు చెబుతాం

జెరూసలెం: ఇప్పటికైనా హిజ్బొల్లా తమ సందేశాన్ని అర్థం చేసుకోవాలని లేకుంటే మరోమారు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు వెనుకాడబోమని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహు హెచ్చరించారు. లెబనాన్​ హిజ్బొల్లా పై ఐడీఎఫ్​ వరుస దాడుల నేపథ్యంలో ఆదివారం ప్రధాని నెతన్యాహు స్పందించారు. హిజ్బొల్లా ఇరాన్​ అండ చూసుకొని విర్రవీగుతోందన్నారు. తమ దేశ సార్వభౌమత్వానికి ఎవ్వరైనా భంగం వాటిల్లే చర్యలకు పాల్పడితే పరిణామాలు అత్యంత తీవ్రంగా ఉంటాయని నెతన్యాహు హెచ్చరించారు.