రష్యా దాడితోనే విమాన ప్రమాదం
అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియవ్
బాకు: అజర్ బైజాన్ కు చెందిన విమానంపై రష్యా దాడి చేసిందని ఆ దేశాధ్యక్షుడు ఇల్హామ్ అలియవ్ ఆదివారం మీడియాకు తెలిపారు. ఇది విషాద సంఘటనగా పేర్కొన్నారు. డిసెంబర్ 25న కజకిస్తాన్ లోని అక్టౌ నగరానికి సమీపంలో అజర్ బైజాన ఎయిర్ లైన్స్ ప్యాసింజర్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో 38మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ విమానాన్ని ఉక్రెయిన్ కు చెందిన డ్రోన్లను కూల్చేందుకు రష్యా ప్రయత్నిస్తుండగా పొరపాటున మిస్సైల్ విమానాన్ని పేల్చివేసింది. శనివారం ఈ ప్రమాదంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ క్షమాపణలు చెప్పారు. ఒకరోజు తరువాత అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ ప్రకటన వెలువడింది. కాగా తొలుత విమాన ప్రమాదం సాంకేతిక లోపం కారణంగానే జరిగిందని భావించారు. అనంతరం దర్యాప్తు బృందాల విచారణలో పక్షి ఢీకొందన్నారు. చివరకు అసలు కారణాన్ని కనుగొని అధ్యక్షుడికి తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షుడి ప్రకటన కంటే ఒక రోజు ముందే జరిగిన తప్పిదాన్ని ఒప్పుకొని క్షమాపణలు తెలిపారు. కాగా ఈ ప్రమాదంలో 38మంది మృతి చెందగా, 29మందికి తీవ్ర గాయాలయ్యాయి.