నిరుద్యోగులపై కేంద్రం శ్రద్ధ 

రోజ్ గార్ మేళాలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

Dec 23, 2024 - 15:49
 0
నిరుద్యోగులపై కేంద్రం శ్రద్ధ 

ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలు అందజేత 

తలొగ్గకుండా నియామక పత్రాలు రోజ్గార్ 

మేళాలో ప్రతిభ కలిగినవారికే ఉద్యోగాలు 

నా శాఖలో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం 

నా తెలంగాణ, హైదరాబాద్: నిరుద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ మెన్స్ క్లబ్ గ్రూప్ సెంటర్, సీ ఆర్ పీ ఎఫ్ చంద్రయాణాగుట్ట లో జరిగిన ‘రోజ్ గార్ మేళా’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందచేశారు. దేశవ్యాప్తంగా 45 కేంద్రాల్లో జరిగే ఈ ఉద్యోగ మేళాలో ప్రధాని మోదీ వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ..' కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న రోజ్‌గార్ మేళాలో భాగంగా ఉద్యోగ నియామక పత్రాలు ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీ తల్లిదండ్రులకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ధన త్రయోదశి, దీపావళి శుభాకాంక్షలు' అని కిషన్ రెడ్డి తెలిపారు.

యువతను భాగస్వామ్యం చేసేలా రోజ్ గార్ మేళా..
దేశ సేవలో యువతను భాగస్వామ్యం చేసేలా, దేశానికి సేవ చేయాలనే దృక్ఫథంతో, వారికి ఉద్యోగాలను కల్పించేలా రోజ్ గార్ మేళా నిర్వహించబడుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. ' యువతకు ఉద్యోగ కల్పనకోసం ఉద్దేశించిన ఈ రోజ్‌గార్‌ మేళాల్లో ఇది 11వది. భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 71వేల మందికి నియామకపత్రాలు అందిస్తున్నది. 10 కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ఉద్యోగాలకు అపాయింట్‌మెంట్ లెటర్లు అందజేస్తున్నాం. ఇవాళ్టితో కలిపి ఇప్పటివరకు.. సుమారు 10 లక్షలమంది యువతీ యువకులు కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలకు సంబంధించిన అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్నారు. దేశంలో ప్రతి నెలా ఉద్యోగ నియామకాలు జరిగేలా ప్రధాని మోదీ ప్రకటించారు. దీంతో అధికారులు వేగవంతంగా ఉద్యోగ భర్తీలు జరుగుతున్నాయి.

మోదీ ప్రభుత్వం పారదర్శకతతో పని చేస్తోంది..
నరేంద్ర మోదీ ప్రభుత్వంలో పారదర్శకతతో, విద్యార్హత ఆధారంగా, ప్రతిభ ఆధారంగా ఉద్యోగ నియామక ప్రక్రియ జరుగుతోందని కిషన్ రెడ్డి చెప్పారు. ' రోజ్ గార్ మేళా నిరంతర ప్రక్రియ.. 12 లక్షల ఉద్యోగాలు టార్గెట్ గా పెట్టుకుని.. దీన్ని పూర్తిచేసే దిశగా కేంద్రం ముందుకెళ్తోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖలో సుమారు 4 లక్షల ఉద్యోగులున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తాం. నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక.. ఇది రెండో రోజ్‌గార్ మేళా. ఇందులో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, పోస్టల్ డిపార్ట్‌మెంట్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, డిపార్ట్ మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ తదితర పది సంస్థలకు సంబంధించిన ఉద్యోగులున్నారు. ఈ 12 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ రంగ, కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ పనిచేసేందుకు అవసరమైన ఉద్యోగాలు మాత్రమే. కానీ ప్రయివేటు రంగంలో కోట్ల సంఖ్యలో ఈ పదేళ్లలో ఉద్యోగాల కల్పన మోదీ ప్రభుత్వం ద్వారా జరిగింది. ప్రైవేటు రంగంలో భారీ సంఖ్యలో ఉద్యోగాల కల్పనకోసం కేంద్రం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ప్రైవేటు సెక్టార్ లో కోట్లాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది. కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. అటువంటి పరిస్థితుల్లోనూ నరేంద్ర మోదీ ప్రభుత్వం దేశంలో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టి, అన్ని రంగాల్లో విశేష చర్యలతో ముందుకెళ్తోంది.