అరుణాచల్ లో చైనా ఆయుధ డంప్ స్వాధీనం
Chinese arms dump seized in Arunachal
ఇటానగర్: అరుణాచల్ లో భారత ఆర్మీ భారీ ఆయుధ డంప్ ను స్వాధీనం చేసుకుంది. ఈ ఆయుధ డంప్ చైనా నుంచి రాష్ర్టలోని తీవ్రవాద సంస్థలకు అందినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఆయుధ డంప్ ను ఆదివారం చాంగ్లాంగ్ జిల్లాలోని నమ్ దఫా రిజర్వ్ ఫారెస్ లో అసోం రైఫిల్స్, ఆర్మీ నిర్వహించిన సంయుక్త ఆపరేషన్ లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో చైనా కుటీల యత్నాలను తిప్పికొట్టినట్లయ్యింది. ఆయుధ డంప్ లో అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ 10 ఎంక్యూ81 లు ఉన్నట్లు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కు డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్, మెటల్ డిటెక్ట్లర్లను ఉపయోగించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి లెఫ్ట్ నెంట్ కల్నల్ అమిత్ మిశ్రా సమాచారం ఇచ్చారు. తూర్పు నాగా మిలిటెంట్లు ప్రభుత్వానికి సరెండర్ అయ్యే ముందు వీటిని దాటి ఉంచినట్లు భావిస్తున్నామన్నారు. ఈ ఆయుధాలు తిరుగుబాటుదారుల చేతిలోకి చేరకుండా ఉండేందుకు తమకు అత్యాధునిక సాంకేతికత చాలా ఉపయోగపడిందన్నారు. ఈ ఆపరేషన్ ను పూర్తి ఖచ్చితత్వంతో, ఇంటలిజెన్స్ పక్కా సమాచారంతో నిర్వహించామన్నారు. ఈ ప్రాంతంలో శాంతి, భద్రతలను కాపాడేందుకు అంకితభావంతో పనిచేస్తున్నామని కల్నల్ అమిత్ మిశ్రా స్పష్టం చేశారు.