ప్రజాశీర్వాదంతోనే ఎదుగుదల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

Feb 17, 2024 - 15:10
 0
ప్రజాశీర్వాదంతోనే ఎదుగుదల సంతోషం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

హరియాణా: దేశ ప్రజలందరి ఆశీస్సులతో భారత్​ అభివృద్ధిలో ఎదుగుదల సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. హరియాణా రేవారిలో రూ. 9750 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. రవాణా, ఆరోగ్యం, రైళ్లు, పర్యాటక రంగాలకు సంబంధించిన శంకుస్థాపనలను ప్రధానమంత్రి శుక్రవారం శంకుస్థాపనలు చేపట్టారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగించారు.  రేవారిలో ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెన్స్‌ (ఎయిమ్స్​)కు శంకుస్థాపన చేశారు. పీఎంఎస్ఎస్‌వై కింద ఏర్పాటు చేయనున్న ఎయిమ్స్‌ను ప్రముఖ హెల్త్‌కేర్ హబ్‌గా, హర్యానా ప్రజలకు నిత్యావసర సేవలు అందించేలా తీర్దిదిద్దనున్నారు.
ప్రజాశీస్సులతోనే జీ-20 సదస్సు విజయవంతమైందని, భారత పకాతం చంద్రుడిపై రెపరెపలాడిందని అన్నారు. గత పదేళ్లలో భారతదేశం ప్రపంచంలోనే 11వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుంచి 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందన్నారు. రాబోయే రోజుల్లో ఇండియాను మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు మీ అందరి సహకారం కావాలని కోరారు.

రామాలయ నిర్మాణం..

యావద్దేశ ప్రజలు అయోధ్యలో భవ్య రామాలయం కోరుకున్నారని, ఇవాళ రామాలయంలో రామ్‌లల్లాను ప్రజలంతా తిలకిస్తున్నారని ప్రధాని అన్నారు. రామాలయం అనేది ఊహాలకే పరిమితమన భావిస్తూ ఎన్నడూ రామాలయ నిర్మాణం కోరుకోని కాంగ్రెస్ వాళ్లు కూడా ఇవాళ జై శ్రీరామ్ నినాదాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

సౌకర్యాలు..

ఎయిమ్స్ రేవారి కాంప్లెక్స్‌లో 270 పడకలతో పాటు, 100 సీట్లతో మెడికల్ కాలేజీ, 60 సీట్లతో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు. అదనపు వైద్యావసరాల కోసం ఆయుష్ బ్లాక్‌లో మరో 30 పడకలు ఏర్పాటు చేయనున్నారు. ఫ్యాకల్టీకి, సిబ్బందికి రెసిడెన్షియల్ అకామిడేషన్, అండర్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ల కోసం హాస్టల్ సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. పేషెంట్లు, విజిటర్ల సౌకర్యార్ధం నైట్ షెల్టర్, గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తారు. ఎయిమస్-రేవారిలో 18 విభన్న మెడికల్ స్పెషాలిటీలు, 17 సూపర్ స్పెషాలిటీలు ఉంటాయి. 16 మోడ్రన్ థియేటర్లు, బ్లడ్ బ్యాంక్‌తో కూడిన డయాగ్నస్టిక్ ల్యాబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నారు.

గురుగావ్ మెట్రోరైల్ ప్రాజెక్టు

కాగా, రూ.5,450 కోట్లతో అభివృద్ధి చేయనున్న గురుగావ్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు కూడా ప్రధాని మోదీ శుక్రవారంనాడు శంకుస్థాపన చేశారు. 28.5 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు మిలీనియం సిటీ సెంటర్ నుంచి ఉద్యోగ్ వివార్ ఫేజ్-5 వరకూ విస్తరించనుంది.