బాధ్యతలను స్వీకరించిన జి.కిషన్​ రెడ్డి

G. Kishan Reddy assumed the responsibilities

Jun 13, 2024 - 13:29
Jun 13, 2024 - 13:35
 0
బాధ్యతలను స్వీకరించిన జి.కిషన్​ రెడ్డి

నా తెలంగాణ, న్యూ ఢిల్లీ: కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు, సికింద్రాబాద్​ ఎంపీ జి. కిషన్​ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని శాస్ర్తి భవన్​ కార్యాలయంలో కుటుంబ సభ్యులతోపాటు కిషన్​ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ నాయకులు కూడా పాల్గొన్నారు. కేంద్రమంత్రి కిషన్​ రెడ్డికి  తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు అభినందనలు తెలిపారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో అంబేద్కర్ విగ్రహానికి, తెలంగాణ అమరవీరుల స్థూపానికి పూలమాలలు సమర్పించారు జి. కిషన్ రెడ్డి.

ఈ సందర్భంగా మంత్రి కిషన్​ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలకు మోదీ ఆకాంక్షల మేరకు సేవ చేస్తానన్నారు. దేశంలో బొగ్గు కొరత లేకుండా చూసుకుంటానన్నారు. మోదీ నేతృత్వంలో విద్యుత్​ కొరతను తీరుస్తామన్నారు. దేశంలో అత్యధిక విద్యుత్​ ఉత్పత్తి బొగ్గు ద్వారానే జరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు.